For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీషమ్‌, బ్రూమ్‌‌లకు దక్కని చోటు: భారత పర్యటనకు కివీస్ జట్టు ఎంపిక

అక్టోబర్‌లో భారత పర్యటనకు వచ్చే న్యూజిలాండ్‌ జట్టును కోచ్‌ మైక్‌ సోమవారం హెసాన్‌ ప్రకటించారు. ప్రస్తుతం తొమ్మిది మందితో కూడిన జట్టుని ప్రకటిస్తున్నామని ఆయన అన్నారు.

By Nageshwara Rao

హైదరాబాద్: అక్టోబర్‌లో భారత పర్యటనకు వచ్చే న్యూజిలాండ్‌ జట్టును కోచ్‌ మైక్‌ సోమవారం హెసాన్‌ ప్రకటించారు. ప్రస్తుతం తొమ్మిది మందితో కూడిన జట్టుని ప్రకటిస్తున్నామని ఆయన అన్నారు. మిగిలిన సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

అయితే ఈ తొమ్మిది మంది జట్టు సభ్యుల్లో ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌, బ్యాట్స్‌మన్‌ నీల్‌ బ్రూమ్‌‌లకు చోటు దక్కలేదు. భారత పర్యటనకు వచ్చే న్యూజిలాండ్ జట్టుకు కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనలో న్యూజిలాండ్ ఆతిథ్య భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

New Zealand axe Neesham, Broom for India tour

తొలి వన్డే అక్టోబరు 22న ముంబైలో జరగనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌-ఎ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఈ జట్టు నుంచి ఆరుగురిని ఎంపిక చేస్తామని హెసాన్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన జట్టులో ఎక్కువ మంది ఆటగాళ్లకు భారత్‌లో ఆడిన అనుభవం ఉందని అన్నారు.

భారత పర్యటనకు ప్రకటించిన న్యూజిలాండ్ జట్టు:
కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), ట్రెంట్‌ బౌల్ట్‌, గ్రాండ్‌హోమ్‌, మార్టిన్‌ గుప్తిల్‌, టామ్‌ లాథమ్‌, ఆడమ్‌ మిల్నే, మిచెల్‌ శాంట్నర్‌, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+