Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో టీ20 సిరీస్‌.. భారీ హిట్టర్లకు చోటు.. న్యూజిలాండ్ జట్టు ఇదే!!

New Zealand announce strong 14-man squad for T20I series against India

ఆక్లాండ్: నెల 24 నుంచి భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే భారత సెలక్టర్లు జట్టుని ప్రకటించగా.. తాజాగా న్యూజిలాండ్ కూడా 14 మందితో కూడిన పటిష్ట జట్టుని ప్రకటించింది. కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. సొంతగడ్డపై జరిగే టీ20 సిరీస్‌ కోసం కివీస్ బోర్డు సీనియర్లు, జూనియర్లకు చోటు కల్పించింది.

రెండు సంవత్సరాల తర్వాత బెనెట్‌కి చోటు:

రెండు సంవత్సరాల తర్వాత బెనెట్‌కి చోటు:

హిట్టర్లు మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రోలు ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. విలియమ్సన్, రాస్‌ టేలర్, గ్రాండ్‌హోమ్, టిమ్ సైఫర్ట్‌, బ్లైర్ టిక్నర్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. ఇస్ సోధి, టిమ్ సౌథీ, హమీశ్ బెనెట్, కుగ్లీజిన్, మిచెల్ శాంట్నర్ బౌలింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే రెండేళ్లుగా జట్టుకి దూరంగా ఉంటున్న ఫాస్ట్ బౌలర్ బెనెట్‌కి జట్టులో చోటివ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. స్టార్ పేసర్ ట్రెంట్ బోల్ట్ టీ20 జట్టులో లేదు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో కివీస్ ప్రయోగాలు చేస్తోంది.

24న తొలి టీ20:

24న తొలి టీ20:

కివీస్ పర్యటనలో భారత్ టీ20, వన్డే, టెస్ట్ సిరీస్‌ల ఆడనుంది. మొదటగా టీ 20 సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ నెల 24న ఆక్లాండ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రెండో టీ20 కూడా ఆక్లాండ్ వేదికగానే 26న.. 29న హామిల్టన్, 31న వెల్లింగ్టన్ వేదికగా వరుసగా మూడు, నాలుగు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఐదవ టీ20 మ్యాచ్‌ ఫిబ్రవరి 2న బే ఓవల్‌లో జరగనుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి.

న్యూజిలాండ్ టీ20 జట్టు:

న్యూజిలాండ్ టీ20 జట్టు:

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో, రాస్ టేలర్, కొలిన్ గ్రాండ్‌హోమ్, బ్లైర్ టిక్నర్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైఫర్ట్ (వికెట్ కీపర్), ఇస్ సోధి, టిమ్ సౌథీ, హమీశ్ బెనెట్, టామ్ బ్రూసీ, కుగ్లీజిన్, డార్లీ మిచెల్.

భారత టీ20 జట్టు:

భారత టీ20 జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ షైనీ, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్.

Story first published: Thursday, January 16, 2020, 15:29 [IST]
Other articles published on Jan 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+