
పేలవమైన ఫామ్..
13 మ్యాచ్‌లల్లో అతను చేసింది 216 పరుగులే. బ్యాటింగ్ యావరేజ్.. 19.64. స్ట్రైక్ రేట్ మరీ ఘోరం. 93.51తో లోయెస్ట్ స్ట్రైక్ రేట్‌ను రికార్డు చేశాడు. ఐపీఎల్లో ఒకే ఒక్క అర్ధసెంచరీ చేశాడు. ఆ స్థాయిలో మళ్లీ ఆడలేకపోయాడు కేన్ విలియమ్సన్. ఆ తరువాత కూడా అతని వైఫల్యాలు కొనసాగాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేయలేకపోయాడు. అటు జట్టును కూడా గెలిపించలేకపోయాడు.

విశ్రాంతి కోసం..
ఆ తరువాత కరోనా వైరస్ బారిన పడ్డాడు కేన్ విలియమ్సన్. రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ టెస్ట్‌కు టామ్ లాథమ్ నాయకత్వాన్ని వహించిన విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న అనంతరం కేన్ విలియమ్సన్.. కొంత బ్రేక్ కోరుకున్నాడు. విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. న్యూజిలాండ్ ఎదుర్కొనబోయే సిరీస్‌లకు దూరం అయ్యాడు. ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్లతో సిరీస్‌లను ఆడటానికి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.. జట్టును ప్రకటించింది.

కేన్ సహా..
అందులో కేన్ విలియమ్సన్కు చోటు దక్కలేదు. అతనితో పాటు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే, ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీలను కూడా జట్టులోకి తీసుకోలేదు. సుదీర్ఘ క్రికెట్ ఆడుతూ వస్తోన్నందున విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొంది బోర్డు. కాగా- న్యూజిలాండ్ జట్టు ఐర్లాండ్, నెదర్లాండ్స్‌తో టీ20 మ్యాచ్‌లను ఆడబోతోంది. స్కాట్లాండ్తో మాత్రం టీ20తో పాటు వన్డే ఇంటర్నేషనల్స్‌లో కూడా తలపడడుతుంది.

వన్డే ఇంటర్నేషనల్స్ ఫార్మట్ టీమ్..
ఐర్లాండ్‌తో సిరీస్ ఆడబోయే వన్డే ఇంటర్నేషనల్స్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌తో జరిగే సిరీస్‌లకు వేర్వేరుగా జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు టామ్ లాథమ్ నాయకత్వాన్ని వహిస్తాడు. ఫిన్ అలెన్, మిఛెల్ బ్రేస్‌వెల్, డేన్ క్లెవెర్ (వికెట్ కీపర్), జాకబ్ డెఫ్పీ, లోకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నె, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిఛెల్ శాంట్నర్, ఈష్ సోధి, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్ జట్టులో ఉన్నారు.

టీ20 ఫార్మట్ టీమ్..
ఆ మూడు దేశాలతో తలపడబోయే న్యూజిలాండ్ టీ20 ఫార్మట్ జట్టుకు మిఛెల్ శాంట్నర్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. ఫిన్ అలెన్, మిఛెల్ బ్రేస్‌వెల్, మార్క్ ఛాప్మన్, డెన్ క్లెవెర్ (వికెట్ కీపర్), లోకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడమ్ మిల్నె, డరిల్ మిఛెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిఛెల్ రిప్పాన్ బెన్ సీర్స్, ఈష్ సోధి, బ్లెయిర్ టిక్నర్ను జట్టులోకి తీసుకుంది. టీ20 వరల్డ్ కప్ వరకూ న్యూజిలాండ్ టీమ్ బిజీ షెడ్యూల్లో గడపనుంది.