T20 World Cup 2022: ఆస్ట్రేలియాతో మ్యాచ్‍కు ముందు కివీస్‍కు ఎదురు దెబ్బ.. గాయంతో స్టార్ ఆల్ రౌండర్ దూరం..
న్యూజిలాండ్ ఆల్-రౌండర్ డారిల్ మిచెల్ శనివారం ఆస్ట్రేలియాతో జరిగే సూపర్-12 మ్యాచ్‌కు దూరమయ్యాడు. గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన మెగా ఈవెంట్ సెమీ-ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న మిచెల్, ప్రస్తుతం అతని వేలిలో ఫ్రాక్చర్ నుంచి కోలుకుంటున్నాడు. మిచెల్ బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో జరిన ట్రై సిరీస్ కూడా దూరంగా ఉన్నాడు. 31 మిచెల్ అక్టోబర్ 17న దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ గేమ్‌లో పాల్గొన్నాడు. కానీ బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.

అందరూ ఫిట్
అక్టోబర్ 22న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆసీస్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు, కేన్ విలియమ్సన్ మిచెల్ అందుబాటులో లేడని ధృవీకరించాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లు ఫిట్‌గా ఉన్నారని చెప్పాడు. "డారిల్ ఇంకా అందుబాటులో లేడు.మేము అతన్ని పరిశీలిస్తున్నాం. మిగతా అందరూ తగినంత ఫిట్‌గా ఉన్నారు" అని విలియమ్సన్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. గత సంవత్సరం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ ఆసీస్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. దీని విలియమ్సన్ మాట్లాడారు.

2009 నుంచి
"అది ఒక గొప్ప ఆట. మాకు దురదృష్టకరం, కానీ ఆ గేమ్‌లో ఆస్ట్రేలియా అత్యుత్తమంగా ఆడింది. రేపు ఇది టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ " అని అతను చెప్పాడు. ఆగస్ట్ 2009 నుంచి న్యూజిలాండ్ ఏ ఫార్మాట్‌లోనూ ఆస్ట్రేలియాలో ఒక్క మ్యాచ్‌ను కూడా గెలవలేదు. తాజాగా స్వదేశంలో జరిగిన ట్రై సిరీస్ కివీస్ కోల్పోయింది. కానీ విలియమ్సన్ గత సంఖ్యల గురించి పెద్దగా ఆలోచించడం లేదని చెప్పడు."మేము దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. మేము మా మంచి ఆటను ప్రదర్శించి గెలుస్తాం " అని విలియమ్సన్ వివరించాడు.

వర్షం
అటు ఆస్ట్రేలియా శనివారం జరగబోయే మ్యాచ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం గండం ఉంది. శనివారం సిడ్నీలో వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఒక్క మ్యాచ్ కే కాదు ఆదివారం జరగబోయే ఇండియా, పాక్ మ్యాచ్ కూడా వర్షం అడ్డు తగిలే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications