For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: 'న్యూజిలాండ్ 7150 కి.మీ.. భారత్ 0 ' - పాక్ క్రికెటర్ అక్కసు

IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నేడు తలపడనున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ లెజెండ్ జునైద్ ఖాన్ చేసిన ఒక ప్రకటన సంచలనం సృష్టించింది. ఈ పాక్ మాజీ పేసర్ తన అక్కసును వెళ్లగక్కాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో న్యూజిలాండ్ జట్టు 7150 కిలోమీటర్లు ప్రయాణించి.. ఆపై ఫైనల్ కు చేరుకుందని.. కానీ టీమిండియా అసలు ప్రయాణించలేదని జునైద్ ఖాన్ అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు దుబాయ్ లో అన్ని మ్యాచ్ లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

New Zealand 7150 km India 0 - Pakistan Cricketer Junaid Khan s Frustration

భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరుకున్న తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించి చర్చ తారాస్థాయికి చేరుకుంది. టీమిండియా ఒకే చోట ఆడటం వల్ల ప్రయోజనం పొందిందని కామెంట్లు చేస్తూనే ఉన్నారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా దీనిపై స్పందించారు. కానీ ఫైనల్ మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ పేసర్ జునైద్ ఖాన్ మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ల సమయంలో అన్ని జట్ల ప్రయాణం గురించి జునైద్ ఖాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

ఏ జట్లు ఎన్ని కిలోమీటర్లు ?
న్యూజిలాండ్-7150 కిలోమీటర్లు
దక్షిణాఫ్రికా-3286 కిలోమీటర్లు
భారత్-0 కిలోమీటర్లు

జునైద్ ఖాన్ పోస్ట్ ద్వారా పరోక్షంగా దుబాయ్ లో టీమిండియా ఆడడాన్ని వ్యతిరేకిస్తున్నాడని.. అదే పిచ్ పై ఆడడం వల్ల భారత్ ప్రయోజనం పొందిందని అతను నమ్ముతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.

Story first published: Sunday, March 9, 2025, 14:19 [IST]
Other articles published on Mar 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+