For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త ప్రపంచ రికార్డులు: కపిల్ రికార్డ్ బ్రేక్, ఈ మంగళవారం ధోనీ, టీమిండియాదే

హామిల్టన్: టీమిండియా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ మంగళవారం రికార్డుల రోజు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో భారత్ గెలవడంతో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును కెప్టెన్ ధోనీ బద్దలుకొట్టినట్లయింది.

ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తన విజయాల రేటును పెంచుకుంది. ఇది టీమిండియాకు వరుసగా ఐదో విజయం. ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో వెస్టిండీస్ పేరిట ఉన్న రికార్డును టీమిండియా సమం చేసింది. మంగళవారం మ్యాచులో విజయం ప్రపంచ కప్ టోర్నీలో భారత్ పేరిట విజయాలను పెంచేసింది.

New World Cup records: Dhoni surpasses Kapil, India on cloud nine

ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా 9 విజయాలను నమోదు చేసిన టీమిండియా.. 1975, 1979లలో వరుసగా వరుస 9 విజయాలను సాధించిన వెస్టిండీస్(ఈ రెండుసార్లు కప్ విండీస్‌దే) రికార్డును సమం చేసింది. 2003 ప్రపంచ కప్ టోర్నీలో గంగూలీ నాయకత్వంలోని టీమిండియా వరుసగా 8 విజయాలు నమోదు చేసింది.

ధోనీ నాయకత్వంలో మరికొన్ని రికార్డులు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1999-2011 కాలంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీల్లో 25 విజయాలను నమోదు చేసింది. కాగా, ప్రపంచ ఉత్తమ కెప్టెన్లలో ధోనీ ఒకడిగా ఇప్పటికే గుర్తింపు పొందాడు. ప్రపంచ కప్ టోర్నీల్లో కపిల్ నాయకత్వంలో 11 విజయాలను అందుకున్న టీమిండియా, ధోనీ నేతృత్వంలో 12 విజయాలను నమోదు చేసింది.

ప్రపంచ కప్ టోర్నీల్లో శిఖర్ ధావన్-రోహిత్ శర్మల భాగస్వామ్యం మరో రికార్డును నమోదు చేసింది. 1996లో సచిన్ టెండూల్కర్-అజయ్ జడేజాలు చేసిన 163 పరుగుల భాగస్వామ్యాన్ని 174 పరుగులు చేసిన రోహిత్-శిఖర్ బ్రేక్ చేశారు.

భారత్‌కు ప్రపంచ కప్ అందించింది కేవలం కపిల్, ఆ తర్వాత ధోనీనే. 1983లో కపిల్, 2011లో ధోనీ నేతృత్వంలో టీమిండియా ప్రపంచ కప్ అందుకుంది. 2011 ప్రపంచ కప్ టోర్నీలో మార్చి 20న వెస్టిండీస్ జట్టును ఓడించడంతో టీమిండియా 9 వరుస విజయాలను సాధించింది. 2011 ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా 4 విజాయలను అందుకుంది. 2011 ప్రపంచ కప్ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

కాగా, 2015 ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా 5 మ్యాచులు గెలుపొందింది(పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్). మార్చి 14న అక్లాండ్‌లో జింబాబ్వేతో టీమిండియా తలపడనుంది. మార్చి 19న మెల్బోర్న్‌లో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచులో టీమిండియా.. బంగ్లాదేశ్ జట్టుతో తలపడే అవకాశం ఉంది.

ప్రపంచ కప్ టోర్నీలో ఎక్కువ మ్యాచులు గెలిపించిన కెప్టెన్లు(మార్చి10, 2015 వరకు)

12 మ్యాచుల గెలుపు (14 మ్యాచుల్లో ఒక ఓటమి, ఒకటి టై) ఎంఎస్ ధోనీ(2011, 2015)
11 మ్యాచుల గెలుపు (15మ్యాచుల్లో 4ఓటములు) కపిల్ దేవ్ (1983, 1987)
10 గెలుపు (23 మ్యాచుల్లో 12 ఓటములు, 1 ఫలితం తేలలేదు) మొహ్మద్ అజారుద్దీన్ (1992, 1996,

1999)
9 మ్యాచుల గెలుపు (11 మ్యాచుల్లో 2 ఓటములు) సౌరవ్ గంగూలీ (2003)

ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా 9 వరుస విజయాలు(మార్చి 20, 2011 నుంచి మార్చి 10, 2015)

1. వెస్టిండీస్‌పై 80 పరుగుల తేడాతో విజయం(మార్చి 20, 2011 చెన్నై)
2. ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలుపు (మార్చి 24, 2011, క్వార్టర్ ఫైనల్ అహ్మదాబాద్)
3. పాకిస్థాన్ పై 29 పరుగుల తేడాతో విజయం(మార్చి 30, 2011-సెమీ ఫైనల్, మొహాలీ)
4. శ్రీలంకపై 6 వికట్ల విజయం (ఏప్రిల్ 2, 2011, ఫైనల్, ముంబై)
5. పాకిస్థాన్ పై 76 పరుగుల తేడాతో గెలుపు (ఫిబ్రవరి 15, 2015 అడిలైడ్)
6. దక్షిణాఫ్రికాపై 130 పరుగుల తేడాతో గెలుపు(ఫిబ్రవరి 22, 2015, మెల్బోర్న్)
7. యుఏఈపై 9 వికెట్ల తేడాతో విజయం (ఫిబ్రవరి 28, 2015, పెర్త్)
8. వెస్టిండీస్ పై 4 వికెట్ల తేడాతో గెలుపు (మార్చి 6, 2015, పెర్త్)
9. ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపు (మార్చి 10, 2015, హామిల్టన్)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+