Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని అదృష్టం ఆ రోజుతో పోయిందా..?

Mahendra Singh Dhoni
చెన్నై: మహేంద్ర సింగ్ ధోని ఒకప్పటి ఇండియా అదృష్ణవంతుడు. అందుకు కారణం క్రికెట్లో తను పట్టిందల్లా బంగారం అయింది కొన్ని రోజులు. 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో తన సత్తా చాటి ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఆ లక్ అంతా ఏమందని ఇప్పుడు అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న.

వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రపంచ ఛాంపియన్స్ అయిన టీమిండియా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టెస్టు సిరిస్‌లలో ఎంత ఘోర వైఫల్యం చెందామో అందిరికి చెందింది. ఇప్పడిక ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20. ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ జట్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని సారద్య భాద్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఛాంపియన్స్ లీగ్‌లలో చెన్నై జట్టు కనీసం సెమీస్‌కి కూడా చేరలేదు. అసలు ఒకప్పుడు దోని లక్ అంతా ఎటుపోయిందని ఇప్పడు అందరూ భావిస్తున్నారు.

నిన్న చెన్నైలో న్యూసౌత్ వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డైనమేట్‌ ధోని పేలలేదు. రైనా రెచ్చిపోలేదు. అశ్విన్‌ స్పిన్‌ తిప్పలేదు. బ్రావో మెరవలేదు. బౌలింజర్‌ బంతుల్లో పదునులేదు ఇవన్నీ జరగకపోవడంతో చెనై సూపర్ కింగ్స్ ఇంటికెళ్లాల్సి వచ్చింది. చాంపియన్స్‌ లీగ్‌ టీ 20లో చెనై సూపర్‌కింగ్స్‌ ఖేల్‌ మంగళవారంతో అయిపోయింది. సూపర్‌కింగ్స్‌పై సూపర్‌విన్‌తో న్యూసౌత్ వేల్స్‌ జట్టు సెమీస్‌లోకి వెళ్లింది. ఈ జట్టుతో పాటూ గ్రూప్‌ ఎ నుంచి ముంబై ఇండియన్స్‌ కూడా తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూసౌత్‌వేల్స్‌ జట్టు చెనై సూపర్‌కింగ్స్‌ బౌలర్స్‌ని ఒక ఆట ఆడుకున్నారు. ఓపెనర్లు వాట్సన్‌, వార్నర్‌ చెనై బౌలింగ్‌ను చిత్తు చేశారు. తొలి వికెట్‌కి 54 పరుగుల చేసిన వాట్సన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

సెమీస్‌కు చేరాలంటే 17 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన స్థితిలో చెన్నై సూపర్ కింగ్స్ 18.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటయింది. ఓపెనర్ మైక్ హస్సీ (27 బంతుల్లో 37; 7 ఫోర్లు), రైనా (14 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడినా... ఒత్తిడిలో చెన్నై బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. న్యూసౌత్‌వేల్స్ బౌలర్లలో కీఫ్ మూడు వికెట్లు సాధించగా... క్లార్క్, స్టార్క్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మొత్తం ఆరు పాయింట్లతో న్యూసౌత్‌వేల్స్ ఎ గ్రూప్ టాపర్‌గా సెమీస్‌కు చేరింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+