For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై రవిశాస్త్రి సంచలన కామెంట్స్..!!

భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా జట్టు ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అతడిని కొనసాగించాలని సూచించారు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో ఇంగ్లండ్ టెస్టులో గిల్ రికార్డు బద్దలు కొట్టిన ప్రదర్శన చేసిన తర్వాత రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్ల గిల్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి 387 బంతుల్లో 30 ఫోర్లు, మూడు సిక్సర్లతో 269 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. కెప్టెన్లలో ఒక ఇన్నింగ్స్‌లో 250+ పరుగులు చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అంతేకాకుండా ఇంగ్లండ్‌లో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచి, 1979లో సునీల్ గవాస్కర్ చేసిన 221 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.

ఆట ముగిసిన తర్వాత రవిశాస్త్రి స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడారు. భారత జట్టుకు ఇది శుభసూచకం అన్న రవిశాస్త్రి, సెలెక్టర్లు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. , అతడిని మూడు సంవత్సరాల వరకు ఏమీ అనొద్దని చెప్పిన శాస్త్రి... ఓవర్సీస్ ట్రిప్‌ల నుంచి నేర్చుకోనివ్వాలని అన్నారు. గిల్ తప్పకుండా మెరుగుపడతాడని, మొదటి రోజు నుంచే అతడు ఛాంపియన్ కెప్టెన్ అవుతాడని ఆశించకూడదని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అతడికి సమయం ఇవ్వాలని కోరిన శాస్త్రి.. అతడు ఒత్తిడిని తట్టుకుంటాడా లేదా అనేదే ప్రశ్నగా మిగిలిందన్నారు. దానికి రెండు సెంచరీలతో సమాధానం చెప్పాడు అని అన్నారు.

అంతేకాదు ఒక రోజున్నర బ్యాటింగ్ చేస్తే, అందులో నాలుగు తప్పుడు షాట్లు కూడా లేవని చెప్పిన రవిశాస్త్రి జట్టు 0-1తో వెనుకబడిన సమయంలో కెప్టెన్‌గా ఒత్తిడిని తట్టుకున్నాడని ప్రశంసలు కురిపించారు. మొదటి టెస్టు మ్యాచ్‌లో చేసిన తప్పు నుంచి ఏమి నేర్చుకున్నాడో అది తనకు నచ్చిందన్నారు. నిలకడగా ఆడుతున్న సమయంలో అవుటైన విధానంతో, ఆ తర్వాత టాప్ ఆర్డర్ కుప్పకూలిందని రవిశాస్త్రి పేర్కొన్నారు.

"కాబట్టి, ఈ రోజు ఉదయం బ్యాటింగ్ చేయడానికి వస్తున్నప్పుడు అది అతని మనస్సులో మెదిలి ఉండవచ్చు. నిన్న 114 వద్ద నాటౌట్‌గా ఉన్నాడు. ఈరోజు మాత్రం కచ్చితంగా భారీ స్కోరు చేయాలని అనుకున్నాడు. చేసి చూపించాడు" అని ఈ మాజీ భారత కోచ్ అభిప్రాయపడ్డారు.

గిల్ 269 పరుగులతో టెస్టుల్లో అత్యధిక స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. కెప్టెన్లలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు.

శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌పై నాజర్ హుస్సేన్ ప్రశంసలు

మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో శుభ్‌మన్ గిల్ ఆడిన ఇన్నింగ్స్‌ను కొనియాడారు. గిల్ తన కెరీర్‌లో ఏడవ టెస్టు సెంచరీని, ఇంగ్లండ్‌పై నాల్గవ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లీడ్స్‌లో జరిగిన సిరీస్ ఓపెనర్‌లో 147 పరుగులు చేసిన తర్వాత, టెస్ట్ కెప్టెన్‌గా తన మొదటి రెండు మ్యాచ్‌లలోనే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు.

హుస్సేన్ మాట్లాడుతూ "అతడు ఆడిన షాట్లలో ఎటువంటి తప్పులు లేవు. క్రీజులో ఎక్కడా ఇబ్బంది పడలేదు. స్లిప్ ద్వారా క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం కూడా లేదు. కష్టమైన పరుగులు చేయడు. ఇది అద్భుతమైన డబుల్ సెంచరీ. బహుశా అతడు ట్రిపుల్ సెంచరీ చేయలేకపోయాననే అసంతృప్తిలో ఉన్నాడేమో. సెహవాగ్ అత్యధిక స్కోరును అధిగమించాలని అనుకున్నాడేమో" అని అన్నారు.

కెప్టెన్ గిల్ రాణించడంతో రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయించింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసి, ఇంగ్లండ్‌ను రెండో రోజు ఆట ముగిసే సమయానికి 77/3కు పరిమితం చేసింది.

మొత్తం మీద చూస్తే గిల్ అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. తన కెప్టెన్సీలో జట్టును ముందుండి నడిపించాడు. బ్యాటింగ్ మరియు కెప్టెన్సీలో రాణిస్తూ జట్టుకు మంచి ఫలితాలు అందిస్తున్నాడు.

Story first published: Friday, July 4, 2025, 10:59 [IST]
Other articles published on Jul 4, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+