Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫ్గాన్ ఆటగాడి సంచలనం: సూర్యకుమార్ యాదవ్ రికార్డు ఔట్!

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో తొలి మ్యాచ్‌లోనే అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ కీలక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్థ శతకం బాదిన ఆటగాడిగా ఒమర్జాయ్ నిలిచాడు. తద్వారా భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు.

ఒమర్జాయ్ తుఫాన్ ఇన్నింగ్స్
అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు హాంకాంగ్‌పై 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఒక దశలో 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 110 పరుగులతో కష్టాల్లో ఉన్నప్పుడు.. 25 ఏళ్ల ఒమర్జాయ్ క్రీజులోకి అడుగుపెట్టాడు. ఒమర్జాయ్ కేవలం 20 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. ఈ క్రమంలో ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నాడు.అజ్మతుల్లా ఒమర్జాయ్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఒమర్జాయ్ 252.38 స్ట్రైక్ రేట్ తో విజృంభించాడు. ఒమర్జాయ్ 19వ ఓవర్‌లో తొలి మూడు బంతులకు వరుసగా మూడు సిక్సర్లు కొట్టి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు.

New Record in Asia Cup Afghan Player Azmatullah Omarzai Smashes Suryakumar Yadav s Record

ఎవరి రికార్డులు బద్దలయ్యాయంటే?
ఒమర్జాయ్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ముగ్గురు ఆటగాళ్ల రికార్డులను బద్దలు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 2022లో హాంకాంగ్‌పై 22 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. రెహ్మానుల్లా గుర్బాజ్ అదే ఆసియా కప్‌లో శ్రీలంకపై 22 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. మొహమ్మద్ నబీ 2017లో ఐర్లాండ్‌పై 21 బంతుల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించి, అఫ్గానిస్తాన్ తరఫున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును కలిగి ఉన్నాడు.ఈ విధంగా, ఒమర్‌జాయ్ కేవలం సూర్యకుమార్ యాదవ్‌నే కాదు, గుర్బాజ్, నబీ రికార్డులను కూడా అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు.

మ్యాచ్ సారాంశం
హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ సెదికుల్లా అటల్ (52 బంతుల్లో 73 పరుగులు), ఒమర్జాయ్ (21 బంతుల్లో 53 పరుగులు) అర్ధ సెంచరీలు సాధించడంతో అఫ్గానిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం హాంకాంగ్ జట్టు కేవలం 94 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో గుల్బదిన్ నయీబ్, ఫజల్హక్ ఫరూఖీ చెరో 2 వికెట్లు తీశారు.

Story first published: Wednesday, September 10, 2025, 12:18 [IST]
Other articles published on Sep 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+