చెన్నై: ఐపియల్ 8 ధమాకా ముగిసి, పోటీలు బుధవారం సాయంత్రం ప్రారంభమవుతున్నాయి. ఈ తరుణంలో ఈ ఐపియల్ సీజన్‌లో పెద్ద ఆకర్షణ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ కూతురు జీవా కానుంది.
ధోనీ, సాక్షిల రెండు నెలల కూతురు జీవా ఇప్పటికే చెన్నైకి చేరుకుంది. ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

దీంతో తండ్రితో పాటు జీవా చెన్నైకి చేరుకుంది. ఇక సాక్షి సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఆమె కూడా ధోనీని, జీవాను అనుసరించారు.
జీవా తండ్రి ధోనీకి అదృష్టాన్ని తెచ్చి పెట్టిందనే భావిస్తున్నారు. ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్ వరకు ధోనీ నాయకత్వంలోని టీమిండియా ఒక్క మ్యాచులో కూడా ఓడిపోలేదు.
ఐసిసి ప్రపంచ కప్ పోటీల కోసం ధోనీ ఆస్ట్రేలియాలో ఉండగా, ఆయన భార్య సాక్షి జీవాకు ఫిబ్రవరి 6వ తేదీన జన్మనిచ్చింది.