మౌకా మౌకా ప్రకటన: భారత్‌కు పాక్ ఫ్యాన్ మద్దతు, ఎందుకంటే..
పెర్త్: మౌకా మౌకా యాడ్‌లో పాకిస్తాన్ అభిమాని ఈసారి భారత జట్టు గెలవాలని కోరుకుంటున్నాడు! మౌకా మౌకా యాడ్ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇది విమర్శలకు కూడా దారి తీసింది. ఈ ప్రకటనలో పాకిస్తాన్ అభిమాని... భారత్ ఓటమి కోసం కాచుక్కూచుంటాడు.
అయితే, ఈసారి భారత్ గెలవాలని కోరుకుంటాడు. ప్రపంచకప్‌లో భాగంగా మార్చి పదవ తేదీన గ్రూప్ బీలోని భారత్ - ఐర్లాండ్ జట్ల మధ్యన మ్యాచ్ ఉంది.
<center><iframe width="100%" height="360" src="https://www.youtube.com/embed/kXTnBMfh1xo?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
భారత్.. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, యూఏఈలతో ఆడిన సమయంలో ప్రకటనలోని పాక్ అభిమాని.. ఆయా జట్ల జెర్సీ ధరించి భారత్ ఓడిపోవాలని కోరుకుంటాడు. భారత్ ఓడిపోతే టపాసులు పేల్చాలనుకుంటాడు. కానీ అతని ఆశలు నెరవేరలేదు.
మార్చి 10న జరగనున్న మ్యాచులో మాత్రం భారత్ గెలవాలని కోరుకుంటున్నాడు. ఐర్లాండుతో జరిగే మ్యాచులో భారత్ గెలవాలని పాక్ అభిమాని కోరుకోవడం వెనుక ఓ కారణం ఉంది. ఈ మ్యాచులో భారత్ ఓడితే పాకిస్తాన్‌కు క్వార్టర్ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి. అయితే, మిగిలిన మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలవాల్సి ఉంది. అలా కాకుండా ఐర్లాండ్ ఓడితే పాకిస్తాన్ సులభంగా క్వార్టర్‌కు చేరుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications