ముంబై: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల పైన వేటు పడిన నేపథ్యంలో ఐపీఎల్లోకి రెండు కొత్త ఫ్రాంచైజీలు రానున్నాయి. ఈ కొత్త ఫ్రాంచైజీలు అతి తక్కువ ధరకే మహేంద్ర సింగ్ ధోనీని దక్కించుకునే వెసులు బాటు దక్కుతోంది.
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లోకి ప్రవేశించే రెండు కొత్త ఫ్రాంచైజీల పేర్లు వెల్లడి కానున్నాయి. బీసీసీఐ, ఐపీఎల్ నిబంధనల ప్రకారం... అతి తక్కువ బిడ్డింగ్ వేసి ఫ్రాంచైజీని పొందేవారు దిగ్గజ ఆటగాళ్ల నుంచి తమకు నచ్చిన వారిని తొలుత ఎంపిక చేసుకోవచ్చు.

ఈ నిబంధనే ఆసక్తిగా మారింది. గత సంవత్సరం టోర్నమెంటు అనంతరం సుప్రీం ఆదేశాల మేరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీములపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ రెండు ఫ్రాంచైజీల ఆటగాళ్లలో ధోనీ హాట్ ఫేవరెట్. తక్కువ బిడ్ దాఖలు చేసిన ఫ్రాంచైజీ... తన తొలి ప్లేయర్‌ను ధోనీనీ తీసుకునే అవకాశముంది. కాగా, ఆటగాళ్ల వేలం 15వ తేదీన జరుగనుంది.