
హైదరాబాద్: 2018లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని చైన్నై సూపర్ కింగ్స్‌కు తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. ఢిల్లీలో నిర్వహించిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధం ముగియడంతో వచ్చే ఏడాది నుంచి జరిగే ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు తిరిగి పునరాగమనం చేయనున్నాయి. దీంతో ఈ రెండూ జట్లూ తమ పాత ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో ధోని వచ్చే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడనున్నారు. అయితే ధోనితో పాటు గత రెండేళ్లుగా రైజింగ్ పుణె సూపర్ జయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లలో ఆడుతున్న ఆటగాళ్లు కూడా తిరిగి తమ పాత జట్లలో కనిపించే అవకాశం కలిగింది.
ప్లేయర్లను అట్టిపెట్టుకునే విధానం:
గతేడాది తమతో ఆడిన వారిలో గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను తమతో ఉంచుకునేలా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవకాశం కల్పించింది. ఇందులో ముగ్గురు ఇండియన్లు, ఇద్దరు విదేశీయులై ఉండేలా నిబంధన విధించారు. దీంతో ప్రతి ఫ్రాంఛైజీ తమ పాత ఆటగాళ్లను ఐదుగురిని తమ వద్దే అట్టిపెట్టుకుని మిగతా వాళ్లను వేలానికి వదిలేయనుంది. ఇక, వేలానికి ముందు ముగ్గురు, వేలంలో రైట్ టు మ్యాచ్ కింద మరో ఇద్దరిని కొనసాగించుకొనే అవకాశం ప్రతి ఫ్రాంచైజీకే వదిలేసింది. ఈ లెక్కన ప్రతి జట్టు ముఖ్యమైన ఆటగాళ్లను కొనసాగించుకోవచ్చు. దీంతో పాటు ఒక్కో ఫ్రాంఛైజీ ఆటగాళ్లకు చెల్లించే మొత్తాన్ని రూ.66 కోట్ల నుంచి రూ.80 కోట్లకు పెంచినట్లు వెల్లడించింది.
1 Maximum number of 3 Capped Indian players.
2 Maximum number of 2 Overseas players.
3 Maximum number of 2 Uncapped Indian players.
ప్రతి సీజన్‌లో కనీసం 75 శాతం ఖర్చు:
ఇక ఒక్కో ఫ్రాంచైజీకి ఆటగాళ్ల కొనుగోలు కోసం 2018లో రూ.80 కోట్లు, 2019లో రూ.82 కోట్లు, 2020లో రూ.85 కోట్లు కేటాయించారు. ప్రతి సీజన్‌లోనూ ఆయా ప్రాంఛైజీలు కనీసం 75 శాతం ఖర్చు పెట్టాల్సి ఉంది. వేలానికి ముందే ముగ్గురు ప్లేయర్స్‌ను కొనసాగించాలని నిర్ణయిస్తే.. దానిని బట్టి ఆటగాళ్ల గరిష్ట పరిమితిలో తగ్గింపు ఉంటుంది.
ఒకవేళ ముగ్గురు ఆటగాళ్లను కొనసాగిస్తే.. తొలి ఆటగాడికి రూ.15 కోట్లు, రెండో ఆటగాడికి రూ.11 కోట్లు, మూడో ఆటగాడికి రూ.7 కోట్లుగా నిర్ణయించారు. ఇద్దరు ఆటగాళ్లే అయితే.. తొలి ఆటగాడికి రూ.12.5 కోట్లు, రెండో ఆటగాడికి రూ.8.5 కోట్లుగా లెక్కిస్తారు. ఒక్క ప్లేయర్‌నే కొనసాగించాలని అనుకుంటే రూ.12.5 కోట్లుగా పరిగణిస్తారు. ఒకవేళ కనీస ధర లేని ప్లేయర్ అయితే రూ.3 కోట్లుగా లెక్కిస్తారు.
Salary Cap
2018: Rs 80 crore
2019: Rs 82 crore
2020: Rs 85 crore
Minimum spend: 75 per cent of the salary cap
Player Retention Price Guideline
Option 1
3 players retained pre- auction
Salary Cap
Player 1: Rs 15 cr
Player 2: Rs 11 cr
Player 3: Rs 7 cr
Option 2
2 players retained pre-auction
Salary Cap
Player 1: Rs 12.5 cr
Player 2: Rs 8.5 cr
Option 3
1 player retained pre-auction
Salary Cap
Player 1: Rs 12.5 cr
Uncapped players INR 3 crore per player.
Minimum Auction Reserve Price
Uncapped players
Rs 10 lakh increased to Rs 20 lakh
Rs 20 lakh increased to Rs 30 lakh
Rs 30 lakh increased to Rs 40 lakh
Capped Players
Rs 30 lakh increased to Rs 50 lakh
Rs 50 lakh increased to Rs 75 lakh
Rs 75 lakh increased to Rs 1 crore
Rs 1 crore increased to Rs 1.5 crore
Rs 1.5 crore increased to Rs 2 crore
Rs 2 crore base price remained unchanged.
Squad Size
A maximum of 25 players (up to 8 overseas) and a minimum of 18 players.