Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఆరుగురు టీ20 సిరిస్‌లో సఫారీ జట్టు తలరాతను మారుస్తారా?

New format and new faces will help South Africa, says JP Duminy

హైదరాబాద్: టీమిండియాతో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరిస్‌లో కొత్త కుర్రాళ్లు సాయపడొచ్చని తాత్కాలిక కెప్టెన్ జేపీ డుమిని పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 సిరిస్‌లో పలువురు యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

టీ20 సిరిస్ కోసం ప్రకటించిన 14 మంది జట్టు సభ్యుల్లో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆరుగురు కొత్త కుర్రాళ్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 సిరిస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన జేపీ డుమిని మాట్లాడుతూ దూకుడుగా ఆడే కొత్త కుర్రాళ్లు టీ20 సిరీస్‌లో తమ జట్టుకు విజయం అందించగలరని ధీమా వ్యక్తం చేశాడు.

'టీ20 సిరీస్‌లో మాకు కొత్త కుర్రాళ్లు సాయపడొచ్చు. దీని గురించే మేం ఉదయం మాట్లాడుకున్నాం. మిగతా వాటితో పోలిస్తే ఈ ఫార్మాట్‌ భిన్నమైనది. ఇందులో వేగంగా, దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. బ్యాట్స్‌మెన్‌ అత్యుత్తమ బ్యాటింగ్‌ను బయటకు తెస్తుంది' అని డుమిని అన్నాడు.

'టీ20 సిరిస్‌లో భాగంగా జట్టుకు నాయకత్వం వహించేందుకు ఆత్రుతగా ఉన్నా. కెప్టెన్సీ నాలో ఉన్న అత్యుత్తమ ఆటను బయటకు తీసుకొస్తుందని అనుకుంటున్నా. ఆటగాళ్లను ముందుకు నడిపించడాన్ని ఆస్వాదిస్తా. వన్డే సిరీస్‌లో భారత్‌ మమ్మల్ని పూర్తిగా చిత్తుచేసింది. 2019 వరల్డ్ కప్‌కు ఏడాది ముందు ఇది మాకో పరీక్ష లాంటింది'

'మేం ఇంకా ఎక్కడ మెరుగవ్వాలో ఈ సిరీస్‌ ఓటమి నేర్పింది. భారత్‌కు అంతగా అనుకూలించని పరిస్థితులున్న పిచ్‌లపై కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌ అద్భుతంగా వికెట్లు తీశారు. టీ20 సిరీస్‌లో ఏబీ డివిలియర్స్‌ చెలరేగుతాడని ఆశిస్తున్నా. అతడు తనకు తానుగా నిర్దేశించుకున్న ప్రమాణాలు అత్యున్నతంగా ఉంటాయి' అని డుమిని అన్నాడు.

భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరిస్ షెడ్యూల్:
టీ20లు:

1st T20I: Feb 18, 2018, Sunday @ New Wanderers Stadium, Johannesburg
06:00 PM (IST)

2nd T20I: Feb 21, 2018, Wednesday @ Supersport Park, Centurion
09:30 PM (IST)

3rd T20I: Feb 24, 2018, Saturday @ Newlands, Cape Town
09:30 PM (IST)

Story first published: Sunday, February 18, 2018, 12:39 [IST]
Other articles published on Feb 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+