For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జీవితంలో ఎప్పుడైనా! ఈ సారి కొత్త ఛాంపియ‌న్: ఎవ‌రు గెలిచినా స‌రికొత్త చ‌రిత్రే!

New Champion will raise after World Cup 2019 Final Match

లండ‌న్‌: ప‌్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ మెగా ఈవెంట్‌లో మ‌రో అంకం ముగిసింది. ఈ సారి స‌రికొత్త ఛాంపియ‌న్‌ను అందించ‌బోతోంది. ఆదివారం లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో జ‌రిగే ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం ఓ స‌రికొత్త ఛాంపియ‌న్ ప్ర‌పంచ క్రికెట్ తెర మీద ఆవిర్భ‌వించ‌బోతోంది. అది ఎవ‌ర‌నేది తేల‌డానికి మ‌రో రెండురోజులు ఆగాల్సిందే!. బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో గురువారం జ‌రిగిన రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియ‌న్ ఆస్ట్రేలియా ఇంగ్లండ్ జ‌ట్టు చేతిలో మ‌ట్టి క‌రిచింది. 27 సంవ‌త్స‌రాల త‌రువాత తొలిసారిగా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో అడుగు పెట్టింది ఇంగ్లీష్ జ‌ట్టు. ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్ట‌బోతోంది.

క‌ల నెర‌వేరేనా!

క‌ల నెర‌వేరేనా!

అటు న్యూజిలాండ్‌, ఇటు ఇంగ్లండ్‌.. జీవితంలో ఎప్పుడూ ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌ని జ‌ట్లు. ఈ సారి ఈ రెండూ ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌బోతున్నాయి. ఎవ‌రు గెలిచినా స‌రికొత్త చ‌రిత్రే అవుతుంది. తొలిసారి క‌ప్‌ను అందుకున్న జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టిస్తుంది. ఇప్ప‌టిదాకా మూడుసార్లు ఫైన‌ల్ దాకా వెళ్లి ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది ఇంగ్లండ్ జ‌ట్టు. మూడు సార్లు ఫైన‌ల్ త‌లుపు త‌ట్టినా అదృష్టం వ‌రించ‌లేక‌పోయింది. ఇది అయిదోసారి. ఈ సారి ఫ‌లితం ఎలా ఉంటుంద‌నేది అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది. సొంత‌గ‌డ్డ‌పై ఇంగ్లండ్ జ‌ట్టు ఎడ్జ్‌బాస్ట‌న్‌లో జ‌రిగిన రెండో సెమీఫైన‌ల్‌లో బ‌ల‌మైన ఆస్ట్రేలియా జ‌ట్టును ఖంగు తినిపించిన తీరు చూస్తోంటే.. ఈ సారి వారి క‌ల ఫ‌లించ‌టట్టే క‌నిపిస్తోంది.

అయిదుసార్లు క‌ప్ గెలిచిన చ‌రిత్ర కంగారూల‌ది!

అయిదుసార్లు క‌ప్ గెలిచిన చ‌రిత్ర కంగారూల‌ది!

ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్నమెంట్‌లో త‌న‌దైన ముద్ర వేసింది ఆస్ట్రేలియా. 1975 నుంచి ఇప్ప‌టిదాకా మొత్తం 11 సార్లు ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ల‌ను నిర్వ‌హించారు. ఇందులో అయిదుసార్లు ప్ర‌పంచ ఛాంపియన్‌గా ఆవిర్భ‌వించింది ఆసీస్‌. 1987లో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన ఆస్ట్రేలియా ఫైన‌ల్‌లో అడుగు పెట్టింది. ఛాంపియ‌న్ తిరిగి వెళ్లింది. 1999, 2003, 2007, 2015 టోర్న‌మెంట్ల‌లో క‌ప్ ఆ జ‌ట్టుదే. వెస్టిండీస్‌, భార‌త్‌.. రెండుసార్లు చొప్పున‌..శ్రీలంక‌, పాకిస్తాన్ జ‌ట్లు ఒక్కోసారి చొప్పున ఛాంపియ‌న్లుగా ఆవిర్భ‌వించాయి. 1987లో అండ‌ర్‌డాగ్స్‌గా ప్ర‌పంచ‌క‌ప్ టోర్నమెంట్‌లో అడుగు పెట్టిన క‌పిల్ డెవిల్స్‌.. ఛాంపియ‌న్‌గా ఆవిర్భ‌వించిన తీరు అనిత‌ర‌సాధ్యం. 2011లో అదే మ్యాజిక్ రిపీట్ అయింది. మ‌హేంద్ర‌సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా చ‌రిత్ర‌ను పున‌రావృతం చేసింది. ఈ సారి ఆసీస్ ఈ అదృష్టానికి నోచుకోలేదు.

ఇంగ్లండ్‌కు ఇది నాలుగోసారి!

ఇంగ్లండ్‌కు ఇది నాలుగోసారి!

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇది నాలుగోసారి. ఇప్ప‌టిదాకా మూడుసార్లే ఆ జ‌ట్టు ఫైన‌ల్‌కు వెళ్ల‌గ‌లిగింది గానీ క‌ప్‌ను అందుకోలేక‌పోయింది. మ‌రోసారి త‌న అదృష్టాన్ని పరీక్షించుకోబోతంది. 1979లో వెస్టిండీస్ చేతిలో, 1987లో ఆస్ట్రేలియా చేతిలో, 1992లో పాకిస్తాన్ చేతిలో ప‌రాభ‌వాన్ని చ‌వి చూసింది. తాజాగా- 27 సంవ‌త్సరాల త‌రువాత తొలిసారిగా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో అడుగు పెట్ట‌గ‌లిగింది. ఈ సారి ఫ‌లితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే! ఆసీస్‌పై ఏక‌ప‌క్షంగా ఆధిప‌త్యాన్ని చెలాయించడం, బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అద్భుతాలు చేయడం.. అదృష్టం కొంత ఇంగ్లండ్ వైపే మొగ్గిన‌ట్టు క‌నిపిస్తోంది.

న్యూజిలాండ్‌..రెండోసారి

న్యూజిలాండ్‌..రెండోసారి

బ్లాక్ క్యాప్స్ వ‌రుస‌గా రెండోసారి ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో అడుగు పెట్టాయి. ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఫైన‌ల్‌లో అడుగు పెట్ట‌డం న్యూజిలాండ్ జ‌ట్టుకు ఇది రెండోసారి మాత్ర‌మే. 2015లో తొలిసారిగా ఫైన‌ల్‌లో అడుగు పెట్టిన కివీస్ టీమ్‌కు.. ఇదే ఆస్ట్రేలియా అడ్డు ప‌డింది. తొలిసారి ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతూ ఒత్తిడిలో ప‌డిన న్యూజిలాండ్‌ను త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి చేసింది. అయిదో సారి ఛాంపియ‌న్‌గా ఆవిర్భ‌వించింది. ఈ సారి తానేమిటో నిరూపించుకోవ‌డానికి స‌న్న‌ద్ధ‌మౌతోంది కేన్స్ సేన‌. భార‌త్ వంటి బ‌ల‌మైన జ‌ట్టును సెమీస్‌లో ఖంగు తినిపించింది న్యూజిలాండ్‌. ప్ర‌తికూల ప‌రిస్థితుల‌కు ఎదురొడ్డి నిలిచింది.

Story first published: Friday, July 12, 2019, 7:20 [IST]
Other articles published on Jul 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+