'ఇంత చెత్త పాకిస్థాన్ జట్టును నేనెప్పుడూ చూడలేదు'
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లలో ఇండియానే ఫేవరేట్‌గా నిలుస్తోంది. మరో వైపు పాకిస్థాన్ జట్టులో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ఇంత చెత్త పాకిస్థాన్ జట్టును తాను ఎప్పుడూ చూడలేదని అన్నాడు. తాను ఇలాంటి పాక్ జట్టును ఎప్పుడూ చూడలేదని.. తాము పాకిస్థాన్ తో ఆడినప్పుడు.. వాళ్లు మనల్ని ఓడిస్తుందనే భావన ఎప్పుడూ ఉండేదని చెప్పాడు. ఎందుకంటే పాకిస్థాన్ జట్టులో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
ఆటను మార్చగల బ్యాటర్లు, బౌలర్లు అందరూ కలిసి ఆడారని.. కానీ ప్రస్తుత పాకిస్థాన్ జట్టులో మ్యాచ్ లను గెలిపించగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ, జట్టులో ఐక్యత ఉన్నట్లు అనిపించడం లేదన్నాడు. ప్రస్తుత పాకిస్థాన్ జట్టులో కూడా ఒంటి చేత్తో మ్యాచ్ లను గెలిపించగల ఆటగాళ్లు ఉన్నారని హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు. కానీ ఒక జట్టులో ఏడుగురు లేదని ఎనిమిది మంది ఆటగాళ్లు సరిగా ఆడితేనే ఛాంపియన్స్ ట్రోఫీని గెలవగలరని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ జట్టు ఇప్పుడున్న పరిస్థితులను ఎన్నడూ చూడలేదని.. ఇది తన అభిప్రాయమని హర్భజన్ చెప్పాడు. 2017లో ఫఖర్ జమాన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడి భారత్ ను ఓడించాడని పేర్కొన్నాడు.

కానీ అప్పటి పాకిస్థాన్ జట్టుకు, ఇప్పటి పాకిస్థాన్ జట్టుకు చాలా తేడా ఉందన్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన సింగ్. హర్భజన్ అభిప్రాయంతో ఏకీభవించిన సయ్యద్ అఫ్రిది మాట్లాడుతూ.. 90ల నాటి పాకిస్థాన్ జట్టును, నేటి పాకిస్థాన్ జట్టును పోల్చలేమన్నారు. అప్పట్లో పాకిస్థాన్ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉండేవారని.. కానీ ఇప్పుడు అలాంటి వారు ఎవరూ లేరన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications