'నా మొదటి ఐపీఎల్‌లో ఇంతలా ఆడతానని అనుకోలేదు'

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టుకు ఆడాలనే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అండర్-19 వరల్డ్‌కప్, ఐపీఎల్ మెట్లు లాంటివి అని రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్ రేయాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. టోర్నీలో భాగంగా రేయాన్ పరాగ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో పరాగ్ 49బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 50 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా పరాగ్(17 సంవత్సరాల 175 రోజులు) అరుదైన రికార్డు సృష్టించాడు. అసోంకు చెందిన ఈ ఆల్‌రౌండర్ ఈ సీజన్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

రాజస్థాన్ తరఫున 7 మ్యాచ్‌లాడిన పరాగ్ 32 సగటుతో 160 పరుగులు
ఈ సీజన్‌లో రాజస్థాన్ తరఫున 7 మ్యాచ్‌లాడిన పరాగ్ 32 సగటుతో 160 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు కూడా తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ అనంతరం కోచ్ ప్యాడీ ఆప్టన్‌తో కలిసి మీడియా సమావేశానికి హాజరైన పరాగ్ మాట్లాడుతూ "నా ప్రదర్శన సంతృప్తిగా ఉంది. ఇది నా తొలి ఐపీఎల్ సీజన్ కావడంతో ఇన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తుందనుకోలేదు" అని అన్నాడు.

అండర్-19 వరల్డ్‌కప్ నా కెరీర్‌లో గొప్ప మలుపు
"కొత్త విషయాలు నేర్చుకొని అనుభవం సంపాదించుకోవడానికే ఇక్కడికి వచ్చా. అయితే, తాను జట్టుకు ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉంది. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. అండర్-19 వరల్డ్‌కప్ నా కెరీర్‌లో గొప్ప మలుపు. ఇప్పుడేమో ఐపీఎల్‌లో రాజస్థాన్ తరపున ఆడడం చాలా సంతోషంగా ఉంది" అని రేయాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.

అండర్-19 వరల్డ్‌కప్ నా కెరీర్‌లో గొప్ప మలుపు
"భారత క్రికెట్ జట్టులో ఆడాలనే నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రెండు టోర్నీలు మెట్లు లాంటివి. వచ్చే దేశవాళీ టోర్నీతో పాటు, ఆ తర్వాతి ఐపీఎల్ సీజన్‌లో సత్తాచాటడంపైనే నా దృష్టంతా" అని పరాగ్ తెలిపాడు. పరాగ్ రాణించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 115 పరుగులు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం
రహానే(2), లివింగ్ స్టోన్(14), సంజూ శాంసన్(5), లామ్రోర్(8), శ్రేయస్ గోపాల్(12), స్టువర్ట్ బిన్నీ(0), కృష్ణప్ప గౌతమ్(6), ఇష్ సోథీ(6)లు వరుసగా క్యూకట్టడంతో రాజస్థాన్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో వెటరన్ ఇషాంత్‌శర్మ, అమిత్ మిశ్రా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications