రాత్రికి రాత్రే పెద్ద స్టార్: '6 వికెట్లపై కలలో కూడా ఊహించలేదు'
హైదరాబాద్: సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో టీ20లో భారత లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్‌ను తిప్పేశాడు. అనూహ్యరీతిలో చాహల్ ఆరు వికెట్లు పడగొట్టడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడు టీ20లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దీంతో మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో టీమిండియా సొంతం చేసుకుంది. భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై టీమిండియాకిది హ్యాట్రిక్ సిరీస్ విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. ఆ తర్వాత 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 16.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లాండ్‌కు భారీ లక్ష్యం
203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 13వ ఓవర్ వరకు లక్ష్యం దిశగా సాగినట్టు కనిపించింది. 13వ ఓవర్‌లో 119/2 వికెట్లతో బలంగా కనిపించిన ఆ జట్టు ఆ తర్వాత కేవలం 8 పరుగులు జోడించి చివరి 8 వికెట్లను వెంటవెంటనే కోల్పోవడం గమనార్హం. స్ఫిన్నర్ చాహల్ మ్యాజిక్ చేశాడు.

చాహల్ స్పిన్‌కు చేతులెత్తేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్
చాహల్ స్పిన్ మాయాజాలన్ని ఎదుర్కోలేక ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో ఐదుగురు ఆటగాళ్లు డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. బిల్లింగ్స్, జోస్ బట్లర్, ప్లంకెట్, జోర్డాన్, మిల్స్‌లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. తొలిసారి 6 వికెట్లు తీసుకున్న చాహల్ తన కెరీర్‌లో తొలిసారి ఉత్తమ గణాంకాలను నమోదుచేశాడు.

రాత్రికి రాత్రి పెద్ద స్టార్ అయిపోయిన చాహల్
మూడో టీ20లో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన యజువేంద్ర చాహల్ రాత్రికి రాత్రి పెద్ద స్టార్ అయిపోయాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను చాహల్ సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం చాహల్ మాట్లాడుతూ ఆరు వికెట్లు పడగొడతానని తాను కలలో కూడా అనుకోలేదని చెప్పాడు.

టీమిండియా తరఫున ఆడటం ఆనందం కలిగించింది
'బెంగళూరులో తొలిసారి టీమిండియా తరఫున ఆడటం ఆనందం కలిగించింది. సొంతూరులో ఉండి ఆడినట్టు అనిపించింది. ఆరు వికెట్లు తీస్తానని కలలో కూడా అనుకోలేదు' అని చాహల్ చెప్పాడు. 25 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టిన చాహల్ భారత్ తరఫున టీ-20లో ఉత్తమ గణాంకాలు నమోదుచేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో ఆరు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications