కోహ్లీతో ఛాలెంజ్, బెంగుళూరులో చూడండి: క్లార్క్‌కు భజ్జీ
హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి పాలవడంతో కోహ్లీసేనపై ఒత్తిడి పెరిగిపోయిందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలపై హర్భజన్ సింగ్ తీవ్రంగా మండిపడ్డాడు.
అంతేకాదు కోహ్లీని ఓ ఛాంపియన్‌తో పోల్చిన భజ్జీ అతడికి ఛాలెంజ్ చేయడం అంత తేలికైన విషయం కాదని రెండో టెస్టులో మీరే చూస్తారంటూ ఆస్ట్రేలియాకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడిని జయించడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య అనే విషయాన్ని ఆసీస్ గ్రహించాలని సూచించాడు.

కోహ్లీ చాంపియన్ బ్యాట్స్‌మెన్
'కోహ్లీ ఒక చాంపియన్ బ్యాట్స్‌మెన్. అతడిని ఒత్తిడిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆ ఛాలెంజ్‌ను ఒక చేత్తో విసిరేస్తాడు. మిగతా టెస్టుల్లో సరికొత్త కోహ్లిని ఆసీస్ చూడటం ఖాయం. బెంగుళూరులో జరిగే రెండో టెస్టులో పరుగుల వరద సృష్టిస్తాడు' అని పేర్కొన్నాడు.

టీమిండియాకు విరాట్ కోహ్లీ వెన్నుముక
'భారత క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ ఒక వెన్నుముక. ఏదో ఒక టెస్టులో కోహ్లీని స్వల్ప స్కోరుకు అవుట్ చేసినంత మాత్రానా అతన్ని తక్కువ అంచనా వేయకండి. అతని ఆట ఎప్పుడు చాలా ఎత్తులో ఉంటుంది' అని హర్భజన్ సింగ్ అన్నాడు.

పూణె టెస్టులో టాస్‌ది కీలకపాత్ర
పూణె టెస్టులో టాస్ కీలక పాత్ర పోషించందని భజ్జీ పేర్కొన్నాడు. టాస్ గెలవడంతోనే ఆస్ట్రేలియా సగం మ్యాచ్‌ని గెలిచిందని చెప్పిన భజ్జీ పూణె లాంటి పిచ్‌పై ఆస్ట్రేలియన్లు నిజంగానే సత్తా చాటారని కొనియాడాడు. ఈ సిరిస్ ప్రారంభానికి ముందు భజ్జీ, గంగూలీ ఇద్దరూ 4-0తో సిరిస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే.
మూడు రోజులకే ముగిసిన పూణె టెస్టు
అయితే పూణె పిచ్ డ్రై పిచ్ కావడంతో ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ మూడు రోజులకే ముగిసిన సంగతి తెలిసిందే. పూణె టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలవడంతో కెప్టెన్‌గా కోహ్లీపై విపరీతమైన భార పడిందని టెస్టు ముగిసిన మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications