For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా-పాక్ మ్యాచ్ టైంలో ఊర్వశి పాపకు, పంత్ బాబుకు మధ్య సైలెంట్ వార్..! అందుకే వచ్చిందంటూ నెటిజన్ల ట్రోల్స్

Netizens trolls A Silent Rivalry Between Rishabh Pant and Urvashi Rautela During India vs Pak Rivalry

ఆసియా కప్ మెగా టోర్నమెంట్ గ్రూప్ ఏలో భాగంగా దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌లో ఓటమికి ప్రతీకారాన్ని అసలు సిసలు రీతిలో తీర్చుకుంది. ఈ మ్యాచ్ విజయంతో గ్రూప్-ఏలో ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత పాకిస్తాన్.. 19.5 ఓవర్లల్లో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (43పరుగులు) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తరఫున కోహ్లీ (35), రవీంద్ర జడేజా (35) రాణించడంతో పాటు హార్దిక్ పాండ్యా (33) అద్వితీయ ఫినిషింగ్ నాక్ ఆడడంతో 5వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.

'

కెమెరామ్యాన్ల ఫోకస్ అంతా ఆమెపైనే

ఇక ఈ మ్యాచ్ కోసం స్టేడియానికి వేలాది మంది ప్రేక్షకులతో పాటు చాలా మంది సెలెబ్రెటీలు కూడా హాజరయ్యారు. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ మధ్య టాక్ ఆఫ్ ది టాపిక్‌గా మారిన ఊర్వశి రౌటెలా కూడా ఈ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చింది. రిషబ్ పంత్ వర్సెస్ ఊర్వశి రౌటెలా మధ్య గత కొంత కాలంగా సోషల్ మీడియా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఊర్వశి పాప రావడంతో కెమెరామ్యాన్లు ఆమె మీద తరచుగా ఫోకస్ చేశారు.

చిలుక పలుకులు పలికిన చిలుక ఎందుకొచ్చావమ్మా?

ఇక పాకిస్థాన్‌తో మ్యాచులో అనూహ్యంగా రిషబ్ పంత్‌ను తప్పించి.. అతని స్థానంలో డీకేను రోహిత్ ఎంచుకున్నాడు. దీంతో పంత్ డగౌట్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌కు ఊర్వశి పాప ఎగేసుకుంటూ ఎందుకొచ్చిందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో తనకు క్రికెట్ గురించి తెలియదని.. పెద్దగా క్రికెటర్లు ఎవరూ తెలియదని.. అయినప్పటికీ సచిన్, కోహ్లీ సార్ల గురించి చాలా విన్నాను.. అందువల్ల వారంటే అమిత గౌరవం ఉందని పేర్కొంది. క్రికెట్ అంటే తెలియదని చిలుక పలుకులు పలికిన ఈ చిలుక మళ్లీ ఎందుకొచ్చిందో అందరికీ తెలుసే అంటూ నెటిజన్లు పరోక్షంగా పంత్‌నుద్దేశించి పోస్టులు చేస్తున్నారు.

పంత్ కంట పడాలి.. నన్ను చూసి కుళ్లుకోవాలనేగా..!

ఆమె పంత్ కంట పడాలని.. తన అందాన్ని చూపించి కుళ్లుకునేలా చేయాలని ఈ మ్యాచ్ కోసం వచ్చి ఉండొచ్చని నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే పంత్ మాత్రం స్టాండ్స్ వైపు చూసి చూడనట్లే కన్పించాడు. పూర్తిగా మ్యాచ్‌లో లీనమైన పంత్ దేకను కూడా దేకలేడు. ఊర్వశి కొన్ని సార్లు సీరియస్ ఎక్స్ ప్రెషన్లతో కన్పించింది. అది కొంత మ్యాచ్ ప్రభావం అయినా కొంత మిస్టర్ ఆర్పీ ప్రభావం అయి ఉండొచ్చని నెటిజన్లు పేర్కొంటున్నారు. వీరిద్దరి మధ్య తంతు గురించి.. ఈ మ్యాచ్‌లో ఊర్వశి ప్రెషెన్స్ గురించి నెటిజన్లు పుంఖానుపుంఖాలుగా పోస్టులు చేస్తున్నారు.

ఎర్రటి డ్రెస్‌లో ఎద అందాలతో..

ఏదేమైనా పంత్ బెంచ్ ప్లేయర్‌గా ఉండడం వల్ల ఊర్వశి నుంచి అసలైన హావభావాలు చూడలేకపోయాం. పంత్ బ్యాటింగ్ గానీ కీపింగ్ గానీ చేసి ఉంటే.. మంచి ప్రదర్శన కనబర్చినప్పుడు ఊర్వశి చప్పట్లు కొట్టేదో లేక దిక్కులు చూస్తున్నట్లు నటించేదో దాన్ని బట్టి వీరి మధ్య వార్ ఇంకా ఉందా.. ముగిసిందా అనేది తెలిసేది. అయితే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ కావడం వల్ల స్వతహాగా ఇంట్రెస్ట్‌తో ఊర్వశి వచ్చి ఉండొచ్చు.. కానీ ఆమెకు క్రికెట్ అంతగా తెలియనప్పుడు ఈ మ్యాచ్ కోసం అంత హాట్‌గా రెడీ అయి వస్తుందా? అని నెటిజన్లు డౌట్లు రేకెత్తిస్తున్నారు. ఎర్రని డ్రెస్‌లో.. క్లీవేజ్ కన్పించేలా సొగసును వెదజల్లుతూ పాప రావడం బట్టి ఆమె తన అందాన్ని పంత్‌కు చూపించాలనే ఇన్నర్ ఇంటెన్షనే అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఊర్వశి స్టాండ్స్‌లో సందడి చేయడం అభిమానులకు కూడా కనువిందే.

Story first published: Monday, August 29, 2022, 10:25 [IST]
Other articles published on Aug 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+