న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్‌ది ఐర‌న్ లెగ్‌.. కెప్టెన్సీ ఎక్క‌డైనా స‌రే ఓట‌మే అంటూ ట్రోల్స్‌

Netizens Trolling On Lokesh Rahul Captaincy

టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై నెట్టింట ట్రోలింగ్ న‌డుస్తోంది. రాహుల్ కెప్టెన్‌గా ఎక్క‌డా ఉన్న స‌రే ఆ జ‌ట్టు ఓడిపోతుంద‌ని, దీంతో రాహుల్‌ది ఐర‌న్ లెగ్ అంటూ నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ట్రోలింగ్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. తాజాగా పార్ల్ వేదిక‌గా రాహుల్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవ‌డ‌మే దీనికి కార‌ణం. అంత‌కుముందు టెస్ట్ సిరీస్‌లోనూ రెండో మ్యాచ్‌లో రాహుల్ జ‌ట్టును న‌డిపించాడు. అంత‌కు ముందు తొలి టెస్టులో గెలిచి ఊపు మీదున్న టీమిండియా రాహుల్ కెప్టెన్సీలో ఆడిన రెండో మ్యాచ్‌లో మాత్రం ఓడిపోయింది. అలాగే అంత‌కుముందు ఐపీఎల్‌లోనూ పంజాబ్ కింగ్స్‌కు రాహుల్ నాయ‌క‌త్వం వ‌హించాడు. అక్క‌డ కూడా కెప్టెన్‌గా త‌న తొలి మ్యాచ్‌ను రాహుల్ ఓట‌మితోనే ప్రారంభించాడు. దీంతో అభిమానులు రాహుల్‌ది ఐర‌న్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. రాహుల్ కెప్టెన్సీలో జ‌ట్టు గెల‌వ‌డం సాధ్యం కాద‌ని అంటున్నారు.

నిజానికి బ్యాట‌ర్‌గా రాహుల్‌కు మంచి రికార్డులే ఉన్నాయి. మంచి ఓపెన‌ర్‌గా ఆయా జ‌ట్ల‌కు ఎక్క‌డా ఆడిన భారీగా ప‌రుగులు చేశాడు. కానీ కెప్టెన్‌గా మాత్రం రాణించ‌లేక‌పోతున్నాడు. ఐపీఎల్‌లో అయితే బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ అద‌ర‌గొట్టిన మ్యాచ్‌ల్లో కూడా కెప్టెన్‌గా పంజాబ్‌ జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. అంతేకాకుండా పంజాబ్ కింగ్స్ జ‌ట్టును ఐపీఎల్‌లో ఒక్క సారి కూడా క్వాలిఫైయ‌ర్ రౌండ్‌లోకి తీసుకెళ్ల లేక‌పోయాడు. తాజాగా భార‌త జ‌ట్టుకు కూడా విజ‌యాల‌ను అందించ‌లేక‌పోవ‌డంతో రాహుల్ కెప్టెన్సీపై విమ‌ర్శలు వ‌స్తున్నాయి. రాహుల్‌ది ఐర‌న్ లెగ్ అంటూ నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు.

Team India Test Captain : Doubts On Rohit Sharma's Test Captaincy | Oneindia Telugu

అలాగే లోకేష్ రాహుల్ కెప్టెన్సీ విధానంపై కూడా అంత‌టా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మైదానంలో రాహుల్ కెప్టెన్సీ అంత‌గా బాగాలేద‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు. జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌ను స‌రిగ్గా ఉప‌యోగించ‌కోవ‌డం లేదంటున్నారు. అలాగే స‌మయానికి త‌గ్గ‌ట్టుగా బౌలింగ్‌లో మార్పులు చేయ‌లేక పోతున్నాడ‌ని వాదిస్తున్నారు. రాహుల్ కెప్టెన్సీలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటున్నారు. ముఖ్యంగా బుధ‌వారం ముగిసిన రెండో వ‌న్డేలో రాహుల్ కెప్టెన్సీ విధానంపై విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. బ‌వుమా, డ‌స్సేన్ భాగస్వామ్యాన్ని విడ‌దీయ‌డానికి రాహుల్ స‌రైన వ్యూహాలు రచించ‌లేదంటున్నారు. ముఖ్యంగా టీంలో ఆల్‌రౌండ‌ర్‌గా ఉన్న వెంక‌టేష్ అయ్య‌ర్‌తో బౌలింగ్ చేయించ‌క‌పోవ‌డంపై అభిమానుల మండిప‌డుతున్నారు. ఇత‌ర బౌల‌ర్లు భారీగా ప‌రుగులు ఇస్తూ వికెట్ తీయ‌లేక పోతుంటే జ‌ట్టులో అద‌న‌పు బౌల‌ర్‌గా ఉన్న వెంక‌టేశ్ అయ్య‌ర్‌తో ఎందుకు బౌలింగ్ చేయించ‌లేద‌ని రాహుల్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. టీమిండియా భ‌విష్య‌త్ కెప్టెన్‌గా పేరు ఉండ‌డంతోపాటు ప్ర‌స్తుతం టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్న రాహుల్ నుంచి ఇలాంటి ఫేల‌వ కెప్టెన్సీ మంచి ప‌రిణామం కాద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు.

Story first published: Thursday, January 20, 2022, 13:35 [IST]
Other articles published on Jan 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X