Asia Cup 2022 Final : ఎన్ని జట్లు మారినా పాకిస్థాన్ ఫేటు మాత్రం మారలేదు.. విపరీతంగా నెటిజన్ల ట్రోల్స్

ఆసియా కప్ 2022 టోర్నీ ఫైనల్లో టైటిల్ ఫేవరేట్‌గా దిగిన పాకిస్థాన్.. శ్రీలంక చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత శ్రీలంక ఈ టోర్నీలో ఓటమి అన్నదే లేకుండా కడవరకు సాగి ట్రోఫీని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో 58పరుగులకే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డా హసరంగా(36, 3/27) ఆల్‌రౌండ్ ప్రదర్శనకు భానుక రాజపక్స(71 నాటౌట్) వీరోచిత పోరాటంతో 23పరుగుల తేడాతో పాక్‌ను ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లకు 170 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి పట్ల నెటిజన్లు తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ జట్టు వైఫల్యం కొనితెచ్చుకుందేననేలా కామెంట్లు చేస్తున్నారు.
కీలక క్యాచ్ మిస్ చేసిన షాదాబ్
రాజపక్స 46పరుగుల వద్ద ఉండగా.. షాదాబ్ ఖాన్ క్యాచ్ మిస్ చేస్తాడు. అలాగే 51పరుగుల వద్ద మరో క్యాచ్ మిస్సయి సిక్స్ వెళ్తుంది. షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ పరస్పరం ఢీకొనడంతో ఈ క్యాచ్ మిస్సవుతుంది. ఈ రెండు క్యాచ్‌లు మిస్ చేయడం వల్ల 150 నుంచి 160పరుగులకే పరిమితం కావాల్సిన శ్రీలంక సైకాలాజికల్ స్కోరు అయిన 170కి చేరుకుంది.
ఇక 171పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 22పరుగుల వద్ద వరుస బంతుల్లో బాబర్ ఆజామ్, ఫాఖర్ జమాన్ వికెట్లు కోల్పోయింది. ఇక క్రీజులో ఉన్న రిజ్వాన్ (49బంతుల్లో 55), ఇఫ్తికర్ (30బంతుల్లో 32) వన్డేను తలపించారు. దీంతో రిక్వయిడ్ రన్ రేట్ పెరిగిపోవడం.. హసరంగా 17వ ఓవర్లో మూడు వికెట్లు తీయడం, లోయర్ ఆర్డర్ విఫలమవ్వడం తదితర కారణాల వల్ల పాక్ 147పరుగులకే పరిమితమై ఓటమి మూటగట్టుకుంది.
రిజ్వాన్ టీ20లకు పనికిరాడంటూ..
ఇక పాక్ అపజయం పట్ల కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఎన్ని దశాబ్దాలు మారినా పాక్ జట్టు క్యాచ్ మిస్ చేయడం, ప్లేయర్ల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం మాత్రం పోవట్లేదు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. అంతకుముందు షోయాబ్ మాలిక్, హసన్ అలీ తదితర ఇన్సిడెంట్ల పిక్స్ పోస్టు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
రిజ్వాన్ నంబర్ 1 బ్యాటరే కానీ టీ20లకు పనికిరాడంటూ అతని స్లో ఇన్నింగ్స్ పట్ల కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు రిజ్వాన్‌ను శ్రీలంక జెర్సీలో చూపిస్తూ ఫోటోలు పెడుతూ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రిజ్వాన్‌కు ఇవ్వాలన్నట్లు పోస్టు పెట్టారు. మరికొందరు బాబర్ ఆజామ్‌ను టార్గెట్ చేశారు.
ఎద్దేవా చేసేలా వీడియో ట్వీట్లు
ఇక పాకిస్థాన్ పరాజయాన్ని ఆఫ్ఘనిస్థానీలు సెలబ్రేట్ చేసుకున్న వీడియోలను కొందరు పోస్టు చేశారు. శ్రీలంక విజయాన్ని ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ అభిమానులు జరుపుకుంటూ..పాకిస్థాన్‌ను ఎద్దేవా చేసేలా ఇంకొందరు ట్వీట్ చేశారు. పెద్ద పెద్ద టోర్నీల్లో పాక్ ఫేటు మాత్రం మారడం లేదంటూ కామెంట్లు ట్రోల్స్ పుంఖానుపుంఖానులుగా పడ్డాయి. దిస్ టు షల్ పాస్ అంటూ బాబర్‌ను, షాదాబ్ ఖాన్ మిస్ ఫీల్డింగ్‌ను, ఫాఖర్ జమాన డకౌట్‌ను, ఇలా మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఘటనలు నెటిజన్ల ట్రోల్స్‌కు గురయ్యాయి. మరో ముజే మరో ఫేం వ్యక్తి బాధపడ్డ వీడియో కూడా నెట్టింట వైరలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications