Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేఎల్ రాహుల్ టీ20కి పనికిరాడు.. స్లో ఇన్నింగ్స్ పట్ల పేలుతున్న సెటైర్లు..! కొందరేమో రాహులే కరెక్ట్ అంటూ..

netizens trolls on KL Rahul for his slow strike rate

తిరువనంతపురం స్టేడియం వేదికగా.. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా బుధవారం జరిగిన తొలి టీ20లో 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 8వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110పరుగులు చేసి విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్), కేఎల్ రాహుల్ (56బంతుల్లో 51నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

అయితే ఛేదన టైంలో కేఎల్ రాహుల్ చాలా తడబడుతూ కన్పించాడు. పిచ్ ప్రభావం వల్ల ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. ఇక కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉండడం పట్ల నెటిజన్లు కామెంట్లు, ట్రోల్స్ హోరెత్తిస్తున్నారు. రాహుల్ అసలు టీ20కి పనికిరాని ప్లేయర్ అని ఏసుకుంటున్నారు. అతని కంటే రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లాంటి మంచి ప్లేయర్లు అందుబాటులో ఉన్నారని.. వాళ్లకు ఛాన్సెస్ ఇవ్వాలంటూ పోస్టులు హోరెత్తిస్తున్నారు.

రాహుల్ వల్ల పవర్ ప్లేలో లోయెస్ట్ స్కోరు

పవర్ ప్లేలో 26బంతులు ఆడి కేవలం 11పరుగులు మాత్రమే రాహుల్ చేశాడు. దీంతో భారత్ స్కోరు 6ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయి 17పరుగులు మాత్రమే చేరుకుంది. టీ20ల్లో పవర్ ప్లేలో అత్యంత తక్కువ స్కోరు టీమిండియాకు ఇదే. కోహ్లీ (3పరుగులు 9బంతుల్లో) సైతం తీవ్ర ఇబ్బంది పడ్డాడు. అయితే కోహ్లీ ఔటయ్యాక.. సూర్యకుమార్ యాదవ్ వచ్చి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. వచ్చీ రాగానే రెండు సిక్సులు బాది స్కోరును మళ్లీ గాడిలో పెట్టాడు. అవతలి ఎండ్‌లో సూర్య దంచుడు మొదలెట్టాక.. రాహుల్ కాస్త గాడిలోకి వచ్చి టెస్ట్ ఆపేసి.. వన్డే ఇన్నింగ్స్‌లోకి వచ్చాడు. సింగిల్స్ తీయడానికి రాహుల్ చాలా ఇబ్బంది పడడం స్పష్టంగా కన్పించింది.

11 దేశాలపై హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా

ఇకపోతే ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా కేఎల్ రాహుల్ ఓ ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో టీ20ల్లో 11 దేశాలపై హాఫ్ సెంచరీ చేసిన తొలి టీమిండియా ప్లేయర్‌గా రాహుల్ నిలిచాడు. అతను ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నమీబియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లపై హాఫ్ సెంచరీలు చేశాడు. పాకిస్థాన్ మీద హాఫ్ సెంచరీ చేయాల్సి ఉంది.

టీ20ల్లో చెత్త రికార్డు

ఇక టీ20ల్లో భారత్ తరఫున అతి చెత్త రికార్డును కూడా కేఎల్ రాహుల్ తాజా ఇన్నింగ్స్ ద్వారా నమోదు చేశాడు. టీ20ల్లో అతి తక్కువ స్ట్రైక్ రేటుతో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రాహుల్ తొలి స్థానంలో ఉన్నాడు. రాహుల్ (91.1)తో హాఫ్ సెంచరీ చేయగా.. అంతకుముందు గంభీర్ (93.3), గంభీర్ (108), రోహిత్ శర్మ (112.7), విరాట్ కోహ్లీ (114) తర్వాత స్ట్రైక్ రేట్లతో రాహుల్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

రాహుల్‌కు సన్మానం చేస్తున్నట్లు

ఇక కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ పట్ల కొంత మంది విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. రిజ్వాన్‌ ఫోటోను ముందు మొక్కి రాహుల్ బ్యాటింగ్‌కు దిగుతాడంటూ ఓ నెటిజన్ మీమ్ చేశాడు. మరో నెటిజన్ కేఎల్ రాహుల్‌‌కు పూలదండ, సన్మానం చేస్తున్నట్లు ఫోటో పెట్టి.. పక్కన సన్మానం చేసే వ్యక్తులు తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్లుగా మార్ఫింగ్ చేసి ఫన్నీ మీమ్ చేశాడు. ఇంకొందరు టీ20ల్లో రాహుల్ స్పష్టంగా తడబడుతున్నాడు. అతన్ని తప్పించడమే కరెక్ట్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం రాహుల్‌ను స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తున్నారు. ప్లేయర్ డ్యూటీ స్ట్రైక్ రేట్ మెరుగుపరుచుకోవడం కాదని, మ్యాచ్ విన్ చేయడమని, అది రాహుల్ చేసి చూపించాడని చెబుతున్నారు. పిచ్ స్వభావం తెలిసి కూడా రాహుల్ మీద కామెంట్లు చేస్తున్నవాళ్లకు బుద్ధుందో లేదో మాకు తెలియదు అంటూ ఇంకొందరు ఘాటుగా రిప్లేలు ఇస్తున్నారు.

Story first published: Thursday, September 29, 2022, 11:28 [IST]
Other articles published on Sep 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+