రోహిత్ కెరీర్ నాశనం చేయాలని చూస్తున్నారు.. బీసీసీఐపై నెటిజన్ల మండిపాటు

వెస్టిండీస్‌తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ పేరు లేకపోవడంతో చాలా మంది షాకయ్యారు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20సిరీస్‌కు, ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మకు తాజాగా మరోసారి బీసీసీఐ విశ్రాంతినిస్తూ.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లకు కూడా విశ్రాంతి కల్పించారు. ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్సీ వహించనున్నాడు. ఇక రోహిత్‌కు పదే పదే విశ్రాంతి కల్పిస్తున్నారంటే.. దాని అర్థం ఏంటని బీసీసీఐని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎలాగోలా రోహిత్‌ను, కోహ్లీని వదిలించుకోవాలని చూస్తున్నారని కొందరు అంటుంటే మరికొందరు.. రోహిత్ కెరీర్ నాశనం చేసేందుకు ఇలాంటి నిర్ణయాలు అంటూ తప్పుపడుతున్నారు.
అప్పటి నుంచి రోహిత్ ఒక్క మ్యాచ్ ఆడలేదు
మార్చి 2022లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ముగిసినప్పటి నుండి టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. భారత ఆటగాళ్లు శ్రీలంక సిరీస్‌ను ముగించి.. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బిజీ బిజీ అయిపోయారు. ఐపీఎల్లో కూడా 35ఏళ్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ పెద్దగా రాణించిందేం లేదు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేస్తూ.. రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. రాహుల్ గాయపడ్డంతో రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.
అయిదు రోజుల గ్యాప్ ఉన్నా కూడా..
ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లలో రోహిత్ శర్మ మళ్లీ టీమిండియా జట్టు తరఫున ఆడబోతున్నాడు. సుమారు 5నెలల తర్వాత మళ్లీ జట్టుతో పాటు ఆడుతున్న అతనికి మళ్లీ వన్డే సిరీస్ కోసం విశ్రాంతి దేనికంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్‌గా మరి అంత మోయలేని భారం అతనిపై ఏముంటుందని కొందరు పేర్కొంటున్నారు. భారత జట్టు జూలై 17న ఇంగ్లాండ్ పర్యటన ముగుస్తుంది. మధ్యలో అయిదురోజుల గ్యాప్ ఉంది.
BCCI appointing captains for Indian Cricket Team👇👇#IndvsWI #WIvsIND #Bcci#ShikharDhawan #RohitSharma #INDvsENG pic.twitter.com/qWa9TzaUFU
— Vivek Thakur (kmvi16) July 6, 2022
రోహిత్ - విరాట్ తరాన్ని ముగించేందుకే ఈ నిర్ణయం
రెండ్రోజులు ప్రయాణానికి, విరామానికి చాలు. అక్కడి నుంచి వెస్టిండీస్‌కు వెళ్లి మళ్లీ మూడు రోజుల ప్రాక్టీస్ తర్వాత ఆడేందుకు వీలున్నా.. వారాల కొద్దీ రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడాన్ని నెటిజన్లు ఏమాత్రం హర్షించడం లేదు. బీసీసీఐ విరాట్ కోహ్లీ, రోహిత్ లాంటి ప్లేయర్లకు ఎందుకు ఇంత రెస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదని, దానికి బదులు సెలెక్ట్ చేయట్లేదని చెప్పేయొచ్చుగా అని కొందరు అవాకులుచవాకులు పేల్చుతున్నారు. తరచూగా కెప్టెన్లను మార్చుతున్న విషయమై ఓ నెటిజన్ ఫన్నీ వీడియో చేశాడు. ఈ నిర్ణయం రోహిత్, విరాట్ తరాన్ని ముగించేలా ఉన్నట్లు తోస్తుంది అని మరికొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications