నెట్టింట మ్యాచ్ ఫిక్సింగ్ దుమారం.. కాసులకు కక్కుర్తి పడి ఆఫ్ఘన్ ప్లేయర్లు అమ్ముడుపోయారంటూ నెటిజన్ల పోస్టులు?

ఆసియా కప్ టోర్నీలో సూపర్ 4లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గురయిందంటూ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం బిజినెస్ డీల్ మాట్లాడుకుంటూ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ ఆఫ్ఘన్ ప్లేయర్లపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఘోరమైన ట్రోల్స్‌తో #FixedMatch హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ నబీ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ టాస్ ఓడిపోవడంతో బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా దిగిన కోహ్లీ (122పరుగులు 61బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్లు నాటౌట్), కేఎల్ రాహుల్ (62పరుగులు 41బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) ధాటిగా ఆడారు. మిగతా జట్లపై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆఫ్ఘన్ బౌలర్లు దండిగా పరుగులిచ్చుకున్నారు. పాకిస్థాన్‌ను వణికించిన ఆఫ్ఘన్ భారత్‌పై ఏమాత్రం కసిలేకుండా కన్పించారు. ఇక ఓపెనర్లు ఇద్దరు రాణించడంతో భారత్ నిర్ణీత 20ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 212పరుగులు చేసింది.
ఓమర్జయ్ ఎందుకలా క్యాచ్ ఇచ్చాడు?
ఇక 213పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ భువనేశ్వర్ కుమార్ దెబ్బకు వణికిపోయింది. భువీ 4ఓవర్లలో కేవలం 4పరుగులు మాత్రమే ఇచ్చి 1మెయిడిన్ సహా 5వికెట్లు పడగొట్టాడు. భువీ దెబ్బకు ఆఫ్ఘన్ బ్యాటర్లు క్రీజులో నిలబడాలంటేనే వణికారు. అయితే భువీ బౌలింగ్లో పడ్డ ఓ వికెట్ కూడా నెటిజన్ల కంట పడింది. అజ్మతుల్లా ఓమర్జయ్ భువీ బౌలింగ్లో తీసుకో క్యాచ్ అన్నట్లు డీకేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఇబ్రహీం జార్డన్ (64పరుగులు 59బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) మినహా మరెవరూ రాణించలేదు. దీంతో 8వికెట్లకు 111పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనుమానాలు రేకిత్తిస్తున్న ఆ మూడు క్యాచ్‌లు
నెటిజన్లు ఫిక్స్‌డ్ మ్యాచ్ అనడానికి మూడు కారణాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కోహ్లీ 28పరుగుల వద్ద ఉన్నప్పుడు క్యాచ్ ఔట్ కావాల్సింది. మహమ్మద్ నబీ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా కోహ్లీ హిట్ చేయగా.. బౌండరీ వద్ద ఉన్న ఇబ్రహీం జాడ్రన్ క్యాచ్ అందుకునేందుకు వీలుంది. అయితే అతను ఆ క్యాచ్ వదిలేసిన విధానం చూస్తే ఎవరైనా సరే ఇది కావాలని వదిలేసి ఉంటాడని అనుకోక ఉండరు. లడ్డూ లాంటి క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకునే క్రమంలో వదిలేయడంతో అది సిక్స్ వెళ్లిపోయింది. దీంతో నెటిజన్లు ఈ వీడియోను ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే రిషబ్ పంత్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ముజీబ్ ఉర్ రెహ్మన్ వదలడమే కాకుండా.. వాటిని బౌండరీలకు నెట్టేసినట్లు కన్పించింది. ముఖ్యంగా ఆఫ్ఘన్ ప్లేయర్ల ముఖాల్లో ఎలాంటి కసి కన్పించలేదు. వెరసి నెటిజన్లను ఈ మ్యాచ్ ఫిక్సయిందని ఫిక్సయ్యారు.
విపరీతమైన ట్రోల్స్
ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్, పోస్టులు చేస్తున్నారు. ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం ఆఫ్ఘన్ ప్లేయర్లు అమ్ముడుపోయారంటూ, బీసీసీఐ నుంచి వారి భారీగా డబ్బులు ముడుతాయంటూ కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు బిజినెస్ డీల్ మాట్లాడుకుని ఆడినట్లు ఆడారంటూ ఆఫ్ఘన్‌పై నిప్పులు చెరిగారు. డబ్బుల ఎరకు మరిగారు ఆఫ్ఘన్ ప్లేయర్లు అంటూ కామెంట్లు చేశారు. లడ్డూ లాంటి క్యాచ్ మిస్ చేయడం చూస్తేనే అర్థమవుతుంది.. వాళ్ల లడ్డూలో యాక్టింగ్ ఏంటో అని ఇంకొందరు వ్యంగ్యంగా స్పందించారు. ఇకపోతే ఇంకొందరు భారత్ మీద కూడా టార్గెట్ చేశారు. వెల్ పెయిడ్ ఇండియా సారీ వెల్ ప్లేయిడ్ ఇండియా అంటూ దెప్పిపొడిచారు. మరికొందరు కోహ్లీ సెంచరీ మీద స్పందిస్తూ.. సెంచరీని కూడా కొనొచ్చని చూపించారని, భువీకి 5వికెట్లు పడడంపై భువీ బౌలింగ్లో ఇలా ఔట్ కావాలన్న మాట అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ప్లేయర్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారా లేక నిజాయతీగానే ఆడారా అనేది ధర్మసందేహంలా మారింది.
తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(కెప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫరూఖ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications