న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిన్నారి అభిమానిని పక్కకు నెట్టేసిన కోహ్లీ (వీడియో)

Netizens slam Virat Kohli and Anushka Sharma for behaving rudely with young fan

హైదరాబాద్: అభిమానులకు ఎంతో విలువిచ్చే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. భార్య ముందుంటే మాత్రం ఎవ్వరినీ పట్టించుకోడని మరోసారి నిరూపించాడు. కోహ్లీకి ఫ్యాన్ అయిన ఓ చిన్నారి అభిమాని.. తన ఫేవరెట్ ఆటగాడికి బహుమతి ఇవ్వాలని భావించాడు. ఎయిర్ పోర్టులో కోహ్లీ కనిపించగానే దగ్గరకు వెళ్లి గిఫ్ట్‌ను అందించబోయాడు.

కానీ తన అనుష్క శర్మతో కలిసి కారు వద్దకు వెళ్లడంలో బిజీగా ఉన్న కోహ్లీ.. ఆ అభిమానిని సున్నితంగా పక్కకు నెట్టేశాడు. ఏం తెచ్చాడో చూడడం పక్కకు పెడితే.. కనీసం తన వైపుకు కూడా కన్నెత్తి చూడలేదు. కోహ్లీ-అనుష్కల పెళ్లి ఫోటోలను ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చాడు ఆ బాలుడు. కానీ విరాట్ కనీసం తనను పట్టించుకోకపోవడంతో నిరుత్సాహంతో ఆ చిన్నారి అభిమాని పక్కకు వెళ్లిపోయాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. అనేకమంది అభిమానులు కోహ్లీకి వ్యతిరేకంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నవారు కనీసం అభిమానులను అర్థం చేసుకున్న పాపాన కూడా పోలేదని పలువురు అంటున్నారు. అయితే బిజీగా ఉండే వ్యక్తులకు ఇలాంటి అభిమానులను పట్టించుకొనే తీరిక ఉండదని కూడా పలువురు చెప్పడం గమనార్హం. కాకపోతే.. ఎంత సెలబ్రిటీలైనా అప్పుడప్పుడు ఫ్యాన్స్ భావోద్వేగాలు కూడా అర్థం చేసుకోవాలని కొందరు అంటున్నారు.

ఆసియా కప్‌లో భాగంగా మరో రెండు రోజుల్లో బరిలోకి దిగనున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ లేకుండానే ఆడడానికి సిద్ధమవుతోంది. 'కోహ్లీ మినహా ఇతర భారత బ్యాట్స్‌మెన్‌ ఎవరూ కూడా ఈ పర్యటనలో ఆడటం కష్టమే' అని ఇటీవలే ఇయాన్ చాపెల్‌ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో కోహ్లీపై విమర్శలు కూడా పెరిగాయి.

Story first published: Monday, September 17, 2018, 18:36 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X