
దయ ఉంచమని అడిగేవాళ్లు:
ఓ యూట్యూబ్ ఛానల్‌కి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, పాకిస్థాన్ మధ్య ఆధిపత్య పోరు గురించి షాహిద్ అఫ్రిదీ మాట్లాడుతూ... 'భారత్‌పై మ్యాచ్‌లు ఆడటాన్ని పాకిస్థాన్ బాగా ఎంజాయ్ చేస్తుంది. చాలా సార్లు టీమిండియాని మేము చిత్తు చిత్తుగా ఓడించాం. ఎంతగా అంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆటగాళ్లు తమపై దయ ఉంచమని అడిగేవాళ్లు. భారత్, ఆస్ట్రేలియాతో ఆడడాన్ని బాగా ఆస్వాదించా' అని వెటకారపు వ్యాఖ్యలు చేశాడు.

ఆర్ యు ఓకే అఫ్రిదీ:
షాహిద్ అఫ్రిదీ వ్యాఖ్యలపై భారత అభిమానులు సోషల్ మీడియా మండిపడుతూ.. భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న రికార్డుల్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్ బారినపడిన అఫ్రిదీ.. నాలుగు రోజుల క్రితం కోలుకున్నాడు. దాంతో ఒకవేళ వైరస్ ప్రభావం కారణంగా అతని మతిపోయిందా ఏంటి?, అతని వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోనవసరం లేదు అని కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అతను ఏం మాట్లాడుతున్నాడో..? అతనికే అర్థం కావడం లేదంటూ మరికొందరు జోక్‌లు పేలుస్తున్నారు. 'ఆర్ యు ఓకే' అఫ్రిదీ.. మానసికంగా బాగానే ఉన్నావా?.. నీకు ఇంకా విశ్రాంతి కావాలి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

నాలుగు రోజుల క్రితమే కోలుకున్న అఫ్రిదీ:
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన అఫ్రిదీ.. నాలుగు రోజుల క్రితమే కోలుకున్నాడు. తనతో పాటు తన భార్యా పిల్లలకు కూడా కరోనా పరీక్షల్లో 'నెగెటివ్'గా నిర్ధారణ అయిందని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'ఆ అల్లా దయవల్ల నేను, నా సతీమణి, కూతుళ్లు అక్సా, అన్షా కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు అంతా బాగుంది. మేం కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్ధించిన మీ అందరికి కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయమిది' అని అఫ్రిది ట్వీట్ చేశాడు.

భారత్‌కే మెరుగైన రికార్డ్:
భారత్, పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో.. ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దాయాది దేశాలు కేవలం ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. వాస్తవానికి పాకిస్థాన్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌కే మెరుగైన రికార్డ్ ఉంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ 7 సార్లు భారత్, పాక్ ఢీకొనగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 5 సార్లు తలపడగా నాలుగుసార్లు భారత్ గెలవగా.. ఒక్కసారి డ్రా అయింది. ఇక మ్యాచ్‌ల పరంగ మాత్రం పాక్‌దే పైచేయి. ఇప్పటి వకు ఇరు దేశాల మధ్య 59 టెస్ట్‌లు జరగ్గా.. పాక్ 12 సార్లు గెలవగా.. భారత్ 9 సార్లే విజయం సాధించింది. 38 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. 132 వన్డేల్లో 73 పాక్ గెలవగా.. భారత్ 55 మాత్రమే విజయం సాధించింది. 4 మ్యాచ్‌లు టై అయ్యాయి. ఇక టీ20ల్లో ఇరు జట్లు 8 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించగా.. పాక్ ఒకేసారి గెలుపొందింది. మరొక మ్యాచ్ డ్రా అయింది.
సచిన్ 100 సెంచరీల రికార్డ్‌ని కోహ్లీ మాత్రమే బ్రేక్ చేయగలడు: మాజీ స్పిన్నర్


Click it and Unblock the Notifications












