వాలంటైన్స్ డే సందర్భంగా తమ భాగస్వాములకు సెలబ్రిటీలు ప్రేమను తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా తన సతీమణి బెకీ బోస్టన్‌కు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు చెప్పాడు. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. 'సూపర్ మమ్మీ, వైఫ్, మై వాలంటైన్.. అంతేకాకుండా ప్రో సఫర్ అయిన నీకు హ్యాపీ వాలెంటైన్స్' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు.
అయితే దీనికి ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'నేను ఇండియాకు చెందని వ్యక్తిని, మీ భార్యను ప్రేమిస్తున్నాను' అని కామెంట్ పెట్టాడు. దీనికి ప్యాట్ కమిన్స్ రియాక్ట్ అయ్యాడు. 'ఈ విషయాన్ని నా భార్యకు తెలియజేస్తాను' అని కమిన్స్ రియాక్ట్ అయ్యాడు. సాధారణంగా కామెంట్లను పట్టించుకోని కమిన్స్ దీనికి రియాక్ట్ అవ్వడం గమనార్హం. అంతేకాకుండా ఎలాంటి విసుగు, కోపం చూపించకుండా కూల్‌గా రిప్లై ఇచ్చి అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే కామెంట్ చేసిన వ్యక్తి ఇండియన్ కాదని, అది ఫేక్ అకౌంట్ అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు కెప్టెన్‌గా కమిన్స్ గతేడాది రెండు ఐసీసీ టైటిళ్లను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్‌ను అందుకున్నాడు. రెండు ఫైనల్లోనూ భారత్‌పైనే ఆస్ట్రేలియా విజయం సాధించింది. కెప్టెన్‌గా ఆస్ట్రేలియా జట్టును కమిన్స్ గొప్పగా నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కమిన్స్‌కు ఐపీఎల్ మినీ వేలంలో రికార్డు ధర దక్కింది.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కమిన్స్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లు వెచ్చించింది. కమిన్స్‌కు బౌలర్, కెప్టెన్‌గానే కాకుండా బ్యాటుతోనే సత్తాచాటే సామర్థ్యం ఉంది. ఈ నేపథ్యంలో అతడిని దక్కించుకోవడం కోసజం సన్‌రైజర్స్ తీవ్రంగా ప్రయత్నించి భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. వచ్చే సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ సారథి పగ్గాలు కమిన్స్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. గత సీజన్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్ మార్క్‌రమ్ జట్టును నడిపించాడు. కానీ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.