Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘నా వెనకాల మా డ్యాడీ ఉన్నాడు.. జెండా నీ దగ్గరే ఉంచుకో’.. జాతీయ జెండా పట్ల జై షా వైఖరిపై నెటిజన్ల ఫైర్

Netizens fired on Jay Shah As He refused to Take Indian Flag During India vs Pakistan Match

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి పదవిని భారతీయ జనతా పార్టీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు అయిన జై షా ఏలుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే బీసీసీఐని తన గుప్పిట్లో ఉంచుకుంటున్నాడంటూ అతనిపై విమర్శలు తీవ్రమయ్యాయి. తాజా ఆయన చేసిన పని నెట్టింట్లో రచ్చ రేపుతోంది. ఇండియా పాక్ మ్యాచ్ సందర్భంగా జాతీయ పతాకాన్ని జైషా అవమానించారంటూ జైషాపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ చివరి ఓవర్ నాలుగో బంతిని హార్దిక్ పాండ్యా సిక్స్‌ కొట్టి గెలిపించడంతో స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు, సెలబ్రెటీలు ఓ రేంజులో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొందరు చప్పట్లు కొడితే కొందరు అరుస్తూ.. విజిల్స్ వేస్తూ.. జెండాలు ఊపుతూ తమ ఆనందాన్ని వ్యక్తీకరించారు. ఇక వీఐపీ బాక్స్‌లో ఉంటూ మ్యాచ్ చూస్తోన్న జై షా సైతం సిక్స్ తర్వాత లేచి నిలబడి తెగ సంతోషపడుతూ చప్పట్లు కొట్టాడు.

మా పప్ప ఉన్నాడు.. జెండా ఎందుకు?

ఆ టైంలో జై షా పక్కనే నిల్చున్న ఓ పెద్దమనిషి భారత జెండాను జైషాకు ఇవ్వాలని చూడగా.. నాకు జెండా అవసరం లేదన్నట్లు జై షా వ్యవహరించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట దుమారం రేపుతుంది. ఆయనపై ట్రోల్స్ భారీగా వస్తున్నాయి. గొప్ప పదవిలో ఉండి జాతీయ జెండాను నిరాకరించడమేంటో అంటూ జైషాపై ఫైర్ అవుతున్నారు. ఇదేనా మీ దేశ భక్తి అంటూ ఆడిపోసుకుంటున్నారు. ఇక ఈ విషయమై ప్రముఖ కాంగ్రెస్ లీడర్ జైరామ్ రమేష్ సైతం వ్యంగ్యంగా స్పందించాడు. 'నా వెనకాల మా నాన్న ఉన్నాడు. ఈ జెండా నువ్వే పట్టుకో నాకొద్దు' అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశాడు. దీనిబట్టి అమిత్ షా అండ చూసుకుని కుమారుడు ఏదైనా చేయొచ్చు అనేలా జైరాం రమేష్ ట్వీట్ పరమార్థం.

హమీద్ అన్సారీని అప్పట్లో ఎంత అవమానించారు

మరో నెటిజన్ సైతం సో కాల్డ్ విమర్శకులనుద్దేశించి ఓ థాట్ ఫుల్ ట్వీట్ చేశాడు. మీరు జై షా నేషనల్ ఫ్లాగ్ పట్టుకోకపోవడానికి కారణం.. అతను ఏసీసీలో సభ్యుడు.. ప్రోటో కాల్ ప్రకారం జెండాలు పట్టుకోవద్దు అని అంటున్నారు.. కదా మరీ అప్పట్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ.. భారత ఫ్లాగ్‌కు సెల్యూట్ చేయలేదని ఎంత అవమానించారు. తాను హెడ్ గేర్ కానందున ప్రోటోకాల్ ప్రకారం.. హమీద్ అన్సారీ జాతీయ జెండాకు సెల్యూట్ చేయలేదని మీకు తెలుసా ? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు.

జై షా కాకుండా వేరే ఎవరైనా ఉండుంటేనా..?

జాతీయ జెండాను రిఫ్యూజ్ చేసింది ప్రస్తుతం భాజపా షహేన్ షా అయిన అమిత్ షా పుత్రరత్నం కాబట్టి సరిపోయింది. వేరే ఎవరైనా అయి ఉంటే భాజపా ఐటీ వింగ్ నెట్టింట్లో పోస్టులు పుంఖానుపుంఖానులుగా పోస్టు చేసి ఆ వ్యక్తి పరువు పోయేలా చేసేది అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఉదాహరణకు జైషా స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ లాంటి పర్సన్ ఉండి ఉంటే..అతను ఇలాగే చేసి ఉంటే భక్త గ్యాంగ్ వాళ్లు ఎన్ని పోస్టులు చేసేవారో.. ఎంత ఆడిపోసుకునేవారో అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇంతకీ జై షా విషయంలో సాధారణ క్రికెట్ అభిమానులు ఎలా ఫీలవుతున్నారో మరీ.

Story first published: Monday, August 29, 2022, 14:30 [IST]
Other articles published on Aug 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+