బీసీసీఐకి సిగ్గుండాలి.. భారత మహిళల జట్టు మ్యాచ్‌లు టీవీల్లో టెలికాస్ట్ కాకపోవడంపై నెటిజన్ల ఫైర్

హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు నేటి నుంచి శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సంబంధించిన మ్యాచ్‌లు ఆడనుంది. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో భారత యువ జట్టు వరుసగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి వంటి వారు లేకుండా టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. మిథాలి రాజ్ రిటైర్మెంట్ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డే ఫార్మాట్‌కు కూడా కెప్టెన్‌గా ఎంపికైంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.

టీవీ ప్రసారాలకు ఒక్కరు ముందుకు రాలే

ఇక జూన్ 23న అంటే నేడు టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. టీ20 మ్యాచ్‌లు జూన్ 23, 25, 27 తేదీల్లో జరగనుండగా.. వన్డే సిరీస్‌లో భాగంగా జూలై 1, 4, 7తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. టీ20మ్యాచ్‌లు దంబుల్లా వేదికగా జరగనున్నాయి. మూడు వన్డేలు పల్లెకెలె స్టేడియంలో జరుగుతాయి.

ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక టూర్ టెలివిజన్ లైవ్ ప్రసార హక్కులను దక్కించుకునేందుకు ఒక్క బ్రాడ్ కాస్టర్ కూడా ముందుకు రాలేదు. బీసీసీఐ సైతం ఈ విషయంలో చొరవ తీసుకోకపోవడంతో ఫ్యాన్స్ బీసీసీఐ షేమ్ అంటూ మండిపడుతున్నారు. వరల్డ్ కప్ తర్వాత తొలిసారి వుమెన్స్ టీం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. బీసీసీఐ మాత్రం పట్టనట్టు వ్యవహరించడంపై ఓ రేంజులో విమర్శలు వస్తున్నాయి.

బీసీసీఐ కన్నా శ్రీలంక క్రికెట్ బోర్డు బెటర్

ఇకపోతే శ్రీలంక క్రికెట్ బోర్డు తమ దేశ వీక్షకులు ఈ మ్యాచ్ లైవ్ ప్రసారాన్ని చూడ్డానికి పలు వేదికలు ఏర్పాటు చేసింది. డైలాగ్ టెలివిజన్, ఛానల్ 1NE, శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ ఛానల్, ThePapare.comలో లైవ్ ప్రసారాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు చేయనుంది. ఇందులో డైలాగ్, ఛానల్ 1NE టెలివిజన్ ప్రసారాలు కావడం విశేషం. మిగితావి డిజిటల్ ప్రసారాలు. ఇక భారత్ తరఫున మాత్రం సోనీ, స్టార్ స్పోర్ట్, వయాకామ్ లాంటి దిగ్గజ బ్రాడ్ కాస్టర్లు ఎవరూ ఈ మ్యాచ్ ప్రసారాలు చేయడానికి ముందుకు రాలేదు. ఇక నిన్న సాయంత్రం వరకు ఈ మ్యాచ్‌లు ఇండియాలో ప్రసారమవుతాయా కాదా అనే డైలామా నెలకొంది.

ఆన్ లైన్ ప్రసారానికి ముందుకొచ్చిన ఫ్యాన్ కోడ్

అనుకున్నట్లు గానే ఒక్క బ్రాడ్ కాస్టర్ కూడా టెలివిజన్ ప్రసారాలకు ముందుకురాలేదు. ఇక డిజిటల్ ప్రసారాలకైనా ఎవరైనా ముందుకొస్తారేమో అనే టైంలో ఫ్యాన్ కోడ్ నిన్న అర్ధరాత్రి ఓ ట్వీట్ చేసింది. ఫ్రీగా తమ వెబ్, యాప్ వేదికల్లో ఇండియా వర్సెస్ శ్రీలంక వుమెన్స్ టూర్ ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కనీసం ఆన్ లైన్లో‌నైనా మ్యాచ్ చూసే వీలు దక్కింది. లేకపోతే శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ ఛానలే దిక్కయ్యేది. ఇక మధ్యాహ్నం 2.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

వుమెన్స్ క్రికెట్‌ను నిర్వీర్యం చేస్తున్నారంటూ..

ఇక టెలివిజన్లో ఇండియా వుమెన్స్ క్రికెట్ లైవ్ ప్రసారాలు జరగకపోవడం పట్ల నెటిజన్లు షేమ్ ఆన్ బీసీసీఐ అంటూ మండిపడుతున్నారు. క్రికెట్ బోర్డులు వుమెన్స్ క్రికెట్‌ను నిర్వీర్యం చేస్తున్నాయని ఇది స్యాడ్ తింగ్ అంటూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు. బీసీసీఐ ఐపీఎల్ లాంటి లీగ్‌లను ఆదరిస్తూ.. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను గాలికొదిలేస్తుందంటూ నెటిజన్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. క్రికెట్లో జెండర్ బియస్ మారాలంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. ఇది బీసీసీఐకి మచ్చ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

భారత టీ20 వుమెన్స్ టీం:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), ఎస్. మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజనా వస్త్రాకర్ సింగ్, రేణుకా సింగ్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్.

శ్రీలంక (T20Is మరియు ODIలు) జట్టు

చమరి అతపత్తు (కెప్టెన్), హాసిని పెరీరా, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని, ఓషధి రణసింగ్, సుగండిక కుమారి, ఇనోకా రణవీరం, అచ్చిని కులసూర్య, హర్షిత సమరవిక్రమ, విశాల్‌ గ్విక్రమా, విశాల్‌ జి. , ఉదేశిక ప్రబోధని, రష్మీ డి సిల్వా, హన్సీమా కరుణరత్నే, కౌషని నుత్యంగన, సత్య సందీపని, తారికా సెవ్వండి

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, June 23, 2022, 13:51 [IST]
Other articles published on Jun 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X