Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Avesh Khan Trolls: ఆవేశం స్టార్ రికమండేషన్ క్యాండేటా..? లేక బుమ్రా లాంటి తోపా? అతని ఎంపికపై నెటిజన్ల ఫైర్

Netizens Fire On Avesh Khan Selection in Playing 11 for Hongkong Match As He leaks 53runs in his spell

ఆసియా కప్ 2022లో హాంగ్‌ కాంగ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 40పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా గ్రూప్-ఏ టాపర్‌గా సూపర్ 4కు అర్హత సాధించింది. తొలుత భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 192పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో కాస్త టచ్ చూపించగా.. సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 నాటౌట్) విధ్వంసకాండతో హాంకాంగ్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన హాంగ్ కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆ జట్టు 152పరుగులు చేయగలిగిందంటే అందుకు గల ప్రధాన కారణం భారత బౌలర్ అవేశ్ ఖాన్. అతను తన 4ఓవర్ల కోటాలో ఏకంగా 53పరుగులు ఇచ్చాడు. అతని ఎకానమీ 13.20గా ఉండడం గమనార్హం.

19వ ఓవర్లో 21పరుగులు సమర్పయామి

ఆవేశం స్టార్ అవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో హాంగ్‌కాంగ్ బ్యాటర్లు తుక్కురేగ్గొట్టారు. ఏకంగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాది 21పరుగులు పిండుకున్నారు. అయితే చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో భారత్ విజయం ఖాయమైంది. అయితే డెత్ ఓవర్లలో ఇలాంటి సాధారణ బౌలింగ్ చేయడం పట్ల అవేశ్ ఖాన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. టోర్నీ మున్ముందుకు పోయే టైంలో అవేశ్ ఖాన్ వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పేర్కొంటున్నారు. షమీతో పోల్చితే అవేశ్ ఖాన్ గొప్ప బౌలరా.. అసలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు.. బుమ్రా లోటు లేని తీరుస్తాడని తీసుకున్నారా అంటూ మండిపడుతున్నారు.

అతి చెత్త రికార్డు అవేశ్ ఖాన్ పేరిటే

ఇకపోతే ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యంత ఎక్కువ ఎకానమీతో టీ20ల్లో ఇండియా తరఫున బౌలింగ్ చేసిన బౌలర్‌గా అవేశ్ ఖాన్ అతి చెత్త రికార్డు నమోదు చేశాడు. అతని ఎకానమీ 9.10గా ఉంది. అయినా కానీ అతనికి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. వన్డేల్లోనూ, టీ20ల్లోనూ రెగ్యులర్ ప్లేయర్‌లాగా తీసుకోవడంతో కొందరు నెటిజన్లు అవేశ్ ఖాన్ అంత మ్యాచ్ విన్నరా..? లేక రికమండేషన్ క్యాండేటా అంటూ మండిపడుతున్నారు.

డెత్ ఓవర్లలో అతి డేంజర్ బౌలర్..

ఇక డెత్ ఓవర్లలో అవేశ్ ఖాన్ గణాంకాలు చూస్తే టీమిండియాకు ఎంత డేంజరో అర్థమవుతుంది. అతను గత 7 ఇన్నింగ్స్‌లలో డెత్ ఓవర్లలో భారీగా పరుగులిచ్చుకున్నాడు. అతను 38బంతుల్లోనే 114పరుగులిచ్చుకున్నాడు. ఈ గణాంకాలు చాలు డెత్ ఓవర్లలో అవేశ్ ఖాన్‌ను నమ్ముకుంటే అంతే సంగతి అని.. కానీ అతనిపై ఎనలేని నమ్మకాన్ని ఉంచి.. బౌలర్లు లేరన్నట్లు టీమిండియా మేనేజ్ మెంట్ వ్యవహరిస్తుండడం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

అవేశ్ ఖాన్ బౌలింగ్ కోసం బ్యాటర్ల ఎదురుచూపు

దీపక్ చాహర్, షమీ, మోహ్సిన్ ఖాన్ లాంటి ప్లేయర్లు ఉన్నా వాళ్లెవరిని మేనేజ్ మెంట్ పరిగణనలోకి తీసుకోకపోవడంపై నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. ఇక అతను దిండా అకాడమీ నుంచి వచ్చిన ప్లేయర్.. అంటూ మీమ్స్ పోస్టు చేస్తున్నారు. ఇంకొందరు ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు ఎప్పుడూ అవేశ్ ఖాన్ బౌలింగ్ వేస్తాడా అప్పుడు బాదేద్దాం అన్నట్లు పోస్టులు పెడుతున్నారు. ఇక ప్రముఖ కామెంటేటర్ హర్షభోగ్లే సైతం భారత బౌలింగ్ పట్ల తన కన్సర్స్ వ్యక్తం చేశాడు. హాంగ్ కాంగ్ లాంటి జట్టుపై భారత బౌలింగ్ అంత పెద్ద ప్రభావవంతంగా కన్పించలేదు.. ఇది భారత బౌలింగ్ ఎటాక్ కాదన్నట్లు అతను ట్వీట్ చేశాడు. ఇక దీనిపై నెటిజన్లు సైతం తమ కామెంట్లు చేస్తూ.. ఇకనైనా టీం మేనేజ్ మెంట్ అవేశ్ ఖాన్‌ను టీంలో నుంచి తప్పించాలంటూ కోరుతున్నారు.

Story first published: Thursday, September 1, 2022, 8:16 [IST]
Other articles published on Sep 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+