న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీక్రెట్‌గా ప్రేయసిని పెళ్లాడిన ఆడమ్ జంపా.. స్టోయినిస్‌పై పేలుతున్న సెటైర్లు!

Netizens feels bad for Marcus Stoinis after Adam Zampa gets married to his girlfriend

సిడ్నీ: ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి హట్టి లీ పాల్మెర్‌ను ఈ ఆసీస్ స్పిన్నర్ సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్నాడు. వీరి లవ్వయాణం గురించి అందరికీ తెలిసినప్పిటికీ.. కరోనా మహమ్మారి కారణంగా వివాహం ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. దాంతో జంపా ఎవరికీ తెలియకుండా గతవారమే తన ప్రేయసిని వివాహమాడాడు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్‌డౌన్‌లో చిక్కుకోవడంతో జంపా సహా పలువురి వివాహాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత వారిలో చాలామంది ఏదో రకంగా వివాహాలు చేసుకుని జంటలుగా మారారు. వైరస్ ఇంకా భయపెడుతుండడంతో కొందరు క్రికెటర్లు మాత్రం ఇంకా శుభ ఘడియల కోసం ఎదురుచూస్తున్నారు.

 పెళ్లి మాట ఎత్తని జంపా..

పెళ్లి మాట ఎత్తని జంపా..

ఆడం జంపా గతవారమే వివాహం చేసుకున్నప్పటికీ ఆ విషయాన్ని ఇప్పటి వరకు రహస్యంగా ఉంచాడు. ఇప్పటికి అతని వివాహం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, జంపా ప్రేయసి హట్టీ లీ వివాహ దుస్తులను డిజైన్ చేసిన కేట్ వాలియా అనే కంపెనీ మాత్రం వీరిద్దరి వివాహ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో జంపా వివాహం వెలుగులోకి వచ్చింది. దాంతో ఈ ఆసీస్ లెగ్ స్పిన్నర్‌కు అభిమానులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు విషెస్ తెలియజేస్తున్నారు. జీవితాంతం సంతోషంగా ఉండాలని కూడా దీవిస్తున్నారు.

జంపా,స్టోయినిస్ గే..

జంపా,స్టోయినిస్ గే..

ఇక, మరోవైపు ఆడమ్ జంపా పెళ్లిచేసుకోవడంతో.. నెటిజన్లు మరో ఆస్ట్రేలియా ప్లేయర్, ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్‌పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు. జంపా వివాహంతో స్టోయినిస్ గుండె పగిలిందని, అతన్ని ఆసీస్ స్పిన్నర్ మోసం చేశాడని కామెంట్ చేస్తున్నారు. స్టోయినిస్, ఆడమ్ జంపాల మధ్య ఉన్న స్నేహం, సానిహిత్యం నేపథ్యంలో ఈ ఇద్దరు గేలు అని పెద్ద రచ్చ నడిచింది. అలాంటిదేం లేదని సహచర ఆటగాళ్లు ఖండించినా అవకాశం దొరికినప్పుడల్లా అభిమానులు ఈ ఇద్దరిని గేలు చిత్రీకరించారు.

పేలుతున్న సెటైర్లు..

తాజా జంపా పెళ్లి నేపథ్యంలో మరోసారి ఈ చర్చను తెరమీదకు తెచ్చారు. జంపా పెళ్లితో స్టోయినిస్ దేవదాస్ అయ్యాడని ఒకరంటే.. సాడ్ సాంగ్స్‌తో బాధను తగ్గించుకుంటున్నాడని, ఫుల్‌గా తాగుతూ జంపాను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాడని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. లెగ్ స్పిన్‌తో కాకుండా జంపా గూగ్లీతో స్టోయినిస్ గుండెలను బోల్డ్ చేశాడని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక, ఐపీఎల్ 2021 సీజన్‌లో జంపా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతుండగా.. స్టోయినిస్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ భయంతో జంపా మధ్యలోనే లీగ్ నుంచి తప్పుకోగా.. ఆ తరువాత నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, June 22, 2021, 18:15 [IST]
Other articles published on Jun 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X