For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అంపైర్‌ కాల్‌'తో కోహ్లీ వికెట్ కోల్పోయాడు.. రూట్ బతికిపోయాడు! ఆ నిబంధనను రద్దు చేయండి!

Netizens demands to ban Umpires Call over Joe Root Survives On Day 3
IND vs ENG : Controversial Umpire Call - Kohli's Heated Argument With Umpire After Joe Root Survived

హైదరాబాద్: 'అంపైర్‌ కాల్‌' మరోసారి వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ సాగుతోంది. ట్రేండింగ్ టాపిక్‌గా మారింది. అంపైర్‌ కాల్ నిబంధనను రద్దు చేయండని నెటిజన్ల నుంచి డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇందుకు కారణం మాత్రం చెపాక్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు. ఈ టెస్టులో అంపైర్‌ కాల్ నిబంధన వల్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔట్ అవ్వగా.. ఇంగ్లండ్ సారథి జో రూట్ బతికిపోయాడు. అసలు విషయంలోకి వెళితే..

కోహ్లీ ఔట్:

కోహ్లీ ఔట్:

రెండో ఇన్నింగ్స్‌ విరాట్ కోహ్లీ (62) స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయిన విషయం తెలిసిందే. మొదటగా అలీ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్‌ నితిన్ మీనన్ వేలెత్తేశాడు. కోహ్లీ సమీక్షకు వెళ్లగా.. అంపైర్‌ కాల్‌ నిబంధన కారణంగా అతడు ఔట్ అయ్యాడు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో జో రూట్‌ క్యాచ్‌ ఔట్‌ అంటూ భారత్‌ అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ నితిన్ మీనన్ నిరాకరించాడు. దీంతో కోహ్లీ సమీక్షకు వెళ్లాడు.

రూట్‌ దొరికినా:

రూట్‌ దొరికినా:

రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని తేలింది. కానీ.. జో రూట్‌ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయినట్లు మాత్రం స్పష్టం అయింది. కానీ టీవీ అంపైర్‌ రూట్‌ను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించలేదు. ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు కాబట్టి అది 'అంపైర్‌ కాల్‌' అయింది. అక్షర్ పటేల్‌‌ బంతి వికెట్లను తాకేట్లున్నా.. అది ఆఫ్‌ స్టంప్‌ అవతలి లైన్‌లో పిచ్‌ కావడం వల్ల నిబంధనల ప్రకారం ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని టీవీ అంపైర్‌ మార్చలేకపోయాడు. ఒకవేళ రూట్‌ను అంపైర్‌ ఔట్‌గా ప్రకటించి ఉంటే.. అతను సమీక్ష కోరినా ఔట్ అయ్యేవాడు.

అంపైర్‌ కాల్‌ను బ్యాన్ చేయండి:

ఈ విషయంపై విరాట్ కోహ్లీ కాసేపు ఫీల్డ్‌ అంపైర్‌తో వాదించినా ఫలితం లేకపోయింది. దీంతో కోహ్లీ నిరాశ చెందాడు. ఈ ఘటన మూడో రోజు చివరి ఓవర్లో జరిగింది. ఈ నేపథ్యంలో 'అంపైర్‌ కాల్‌' మరోసారి వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ సాగుతోంది. అంతేకాదు ట్రేండింగ్ టాపిక్‌గా మారింది. అంపైర్‌ కాల్ నిబంధనను రద్దు చేయండని నెటిజన్ల నుంచి డిమాండ్లు పెరిగిపోతున్నాయి. 'అంపైర్‌ కాల్'ను బ్యాన్ చేయండి అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. 'అంపైర్‌ కాల్‌తో కోహ్లీ వికెట్ కోల్పోయాడు.. రూట్ బతికిపోయాడు. వెంటనే ఆ నిబంధనను రద్దు చేయండి' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

విజయానికి చేరువైన భారత్:

ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో అదరగొట్టిన భారత్ రెండో టెస్టులో విజయానికి చేరువైంది. పరీక్ష పెడుతున్న పిచ్‌పై రవిచంద్రన్‌ అశ్విన్‌ (149 బంతుల్లో 106; 14 ఫోర్లు, ఒక సిక్సర్‌) సూపర్‌ సెంచరీతో కదం తొక్కడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (62) హాఫ్‌సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, జాక్‌ లీచ్‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 195 పరుగులతో కలుపుకొని టీమ్‌ఇండియా ఓవరాల్‌గా 482 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్‌ ముందుంచింది. భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఇంగ్లిష్‌ జట్టు.. విజయానికి ఇంకా 429 పరుగుల దూరంలో ఉంది.

Story first published: Tuesday, February 16, 2021, 9:21 [IST]
Other articles published on Feb 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+