RCB Chants: స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ బ్యాడ్ బిహేవియర్.. మధ్యప్రదేశ్ గెలిచినా ఆర్సీబీ గోలే.. నెటిజన్ల ఫైర్

రంజీ ట్రోఫీ 2021 - 22లో ముంబై వర్సెస్ మధ్యప్రదేశ్ జట్లు ఫైనల్లో తలపడగా ముంబైని ఓడించిన మధ్యప్రదేశ్ తొలిసారి సగర్వంగా రంజీ ట్రోఫీ ముద్దాడింది. అయిదో రోజు 113పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ముంబై.. 269పరుగులకు ఆలౌటైంది. ఇక 107పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే మధ్యప్రదేశ్ ముందు ఉంచడంతో ఆ జట్టు అలవోకగా 108పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 72ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి టైటిల్ విజేతగా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా శుభమ్ శర్మ నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా సర్ఫరాజ్ ఖాన్ నిలిచాడు. ఇకపోతే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ గెలిచి ప్లేయర్లు సంబరాలు చేసుకుంటే స్టేడియంలోని ప్రేక్షకులు మాత్రం వాళ్లను డిస్సాపాయింట్ చేసేలా ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ స్లోగన్స్ చేశారు. 72ఏళ్ల తర్వాత తొలిసారి మధ్యప్రదేశ్ టీం రంజీ ట్రోఫీ గెలిచి తమ చిరకాల కల నెరవేర్చుకున్న ఈ తరుణంలో స్టేడియంలోని ప్రేక్షకుల ఆర్సీబీ నినాదాలు కాస్త వెగటుగా అనిపించాయి.
తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో..
ఇక ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రజత్ పాటిదార్ (122) సెంచరీతో రాణించాడు. ఇక తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ 108పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. ఆ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగలింది. 2 పరుగుల వద్ద యష్ దుబే ఔటవ్వడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే హిమాన్షు మంత్రి (37), శుభమ్ శర్మ (30) చాలా జాగ్రత్తగా ఆడారు. అయినా వాళ్లు కూడా ఔటయ్యారు. ఇక చివరి వరకు రజత్ పాటిదార్ (30నాటౌట్) క్రీజులో ఉండి గెలిపించాడు.
అసలింతకు ఎందుకు ఆర్సీబీ జపం చేశారంటే..
ఇక ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున సెంచరీతో మెరిసిన రజత్ పాటిదార్‌కు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. మ్యాచ్ బెంగళూరులో జరగడం.. ఇక ఆర్సీబీ ప్లేయర్ గెలిపించడంతో స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు ఆర్సీబీ ఆర్సీబీ అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. గెలుపు దిశగా ఇన్నింగ్స్ సాగుతున్న తరుణంలో రజత్ పాటిదార్ స్కోర్ చేస్తున్న ప్రతిసారి ఆర్సీబీ ఆర్సీబీ అంటూ స్టేడియంలో క్రౌడ్ గోలగోల చేశారు.
ఇండియా గెలిచినా ఆర్సీబీ ఆర్సీబీ అంటారేమో..
దీనిపై ట్విట్టర్లో నెటిజన్లు తీవ్ర కామెంట్లు చేస్తున్నారు. కాస్త మైండ్ పెట్టి నినాదాలు చేయాలంటూ మండిపడుతున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మధ్యప్రదేశ్ జట్టు గెలిస్తే.. ఆ జట్టు విజయాన్ని ఆస్వాదించనీయకుండా చేస్తారా అంటూ కామెంట్లలో తిట్టిపోస్తున్నారు. ఇక ఓ ఫ్రాంఛైజీ జట్టుకు ఎందుకు అంతా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.. ఇప్పుడు మధ్యప్రదేశ్.. రేప్పొద్దున భారత్ ఆడుతుంటే కూడా ఇండియా ఇండియా అని కాకుండా ఆర్సీబీ ఆర్సీబీ అని అరుస్తారేమో అంటూ మరికొందరు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.
ఆర్సీబీ అభిమానులు కాస్త ఆలోచించండి
ఆర్సీబీ స్టేడియంలో ఆడినప్పుడు స్లోగన్స్ ఇస్తే ఎవరేమనరు కానీ.. ఇలా ఏ జట్టు ఆడినా పిచ్చోళ్లలా ఆర్సీబీ ఆర్సీబీ అంటూ అరవడం ఏంటో అర్థం కావట్లేదంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా మధ్యప్రదేశ్ తొలిసారి విజయం అందుకున్న ఈ తరుణంలో.. ఆర్సీబీనీ పైకెత్తేలా చాంట్స్ చేయడం కాస్త బాగోదేమో. ఆర్సీబీ అభిమానులు కాస్త ఆలోచించాల్సిదంటూ మరికొందరు హితవు పలుకుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications