DC vs KXIP:నువ్వేం బ్యాట్స్‌మన్ సామీ.. ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు డకౌటా? నెట్టింట పేలుతున్న జోక్స్

దుబాయ్: ఓవైపు మార్కస్ స్టోయినిస్(21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) సూపర్ షో చేస్తే.. మరోవైపు మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 89, 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 89) ఏకంగా మాయ చేశాడు.! కానీ ఇద్దరి పోరాట స్పూర్తికి పరీక్ష పెడుతూ టైగా ముగిసిన మ్యాచ్‌లో.. సూపర్ ఓవర్ స్పెషలిస్ట్ రబడా రఫ్ఫాడించాడు.! వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి మూడు బంతులకే పంజాబ్ సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ ముగించాడు.

దీంతో చేజారిపోయిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను మళ్లీ విజయపథంలో నిలబెట్టాడు. విజయానికి అవసరమైన మూడు రన్స్‌ను సులువుగా పూర్తిచేసిన ఢిల్లీ ఐపీఎల్‌లో బోణీ కొట్టింది. ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అభిమానులకు కావాల్సిన మాజా లభించింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సార్లు డకౌట్ అయిన కింగ్స్ పంజాబ్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అలాగే ఆర్‌సీబీ తరఫున విఫలమైన మార్కస్ స్టోయినిస్.. ఢిల్లీ తరఫున చెలరేగడం పట్ల కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌పై సరదా మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

నమ్మితే ముంచేసావుగా పూరన్..

157 పరుగుల లక్ష్య చేధనలో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన నికోలస్ పూరన్ 3 బంతులాడి రవిచంద్రన్ అశ్విన్ సూపర్ బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగిన అతన్ని పంజాబ్ సూపర్ ఓవర్‌లో సాహసోపేతంగా రంగంలోకి దింపి మూల్యం చెల్లించుకుంది. కగిసో రబాడ వేసిన మూడో బంతిని అంచనా వేయలేకపోయిన పూరన్ మరోసారి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ రెండు పరుగులకే ముగిసింది. దీంతో అతనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. విధ్వంసక వీరుడు క్రిస్ గేల్‌ను కాదని తుది జట్టులోకి తీసుకున్నందుకు బాగానే బుద్ది చెప్పావని ఒకరంటే.. మంచి టచ్‌లో ఉన్న మయాంక్‌ను కాదని పూరన్ పంపి పంజాబ్ మూల్యం చెల్లించుకుందని ఇంకొకరు కామెంట్ చేశారు.

స్టోయినిస్ ఇది అన్యాయం...

గత సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన స్టోయినిస్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటి కూడా చేయలేదు. కనీసం తన స్థాయికి తగ్గ ఆటతీరు కూడా కనబర్చలేదు. అలాంటి స్టోయినిస్ ఢిల్లీ తరఫున మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేయడం ఆర్‌సీబీ అభిమానులను తీవ్రంగా బాధించింది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ.. లోయరార్డర్‌లో మెరుపులు మెరిపించి ఢిల్లీకి భారీస్కోర్ అందించాడు. అతని ధాటైన ఇన్నింగ్స్‌తో ఆఖరి మూడు ఓవర్లలో ఢిల్లీ 57 పరుగులు పిండుకుంది. చివరి ఓవర్‌లో 30 రన్స్ చేసింది. అంతేకాకుండా స్టోయినిస్ అద్భుత బౌలింగ్‌తో ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు డిఫెండ్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు దారితీసాడు. దీంతో.. అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్టోయినిస్ ఇది అన్యాయమంటూ ఆర్‌సీబీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దాంతో.. బెంగళూరు కెప్టెన్ కోహ్లీ రియాక్షన్‌ అంటూ ఫన్నీగా మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

క్రిస్ జోర్డాన్‌పై ఫైర్..

పంజాబ్ ఓటమికి కారణాల్లో ఒకడైన క్రిస్ జోర్డాన్‌పై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ను అద్భుత బౌలింగ్‌తో కట్టిడి చేసిన పంజాబ్.. ఆఖరి ఓవర్‌లో క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. జోర్డాన్ ఏకంగా (6 Wd 4 4 4 6 WN1 3)‌ 30 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే బ్యాటింగ్ సమయంలో మయాంక్ అగర్వాల్‌తో షార్ట్ రన్ తీసాడు. ఈ రెండు విషయాలను ప్రస్తావిస్తూ జోర్డాన్‌ను అభిమానులు ఏకీపారేస్తున్నారు. ‘మొత్తం నాశనం చేసేశాడు'అని ఒకరంటే.. ‘కొంచెం వేగంగా పరుగెత్తితే నీ సొమ్ము ఏమైనా పోయేదా?'ఇంకొకరు కామెంట్ చేశారు. తదుపరి మ్యాచ్‌కు తప్పించాలని సూచిస్తున్నారు.

పాపం ప్రీతీ జింటా..

ఇక ఈ మ్యాచ్ ఓటమిపై ప్రీతీ రియాక్షన్‌పై కూడా ఫన్నీ మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం రిస్క్ చేసి యూఏఈ వెళ్లిన ప్రీతీ జింటాకు నిరాశే ఎదురైందని ఒకరంటే.. గెలుస్తదనుకున్న పంజాబ్ ఓడిపోవడంతో సొట్టబుగ్గల సుందరి మొహం మాడిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ‘మయాంక్ ఔటైనప్పుడు ప్రీతీ మొహం చూడాలి.. అబ్బో'అని ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా అందాల తార మనసు నొప్పించారని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చిన మహ్మద్ షమీపై సెటైర్లు వేస్తున్నారు.

ఒక్క షార్ట్ రన్ నా చిరు నవ్వును చిదిమేసింది.. అంపైర్ తప్పిదంపై ప్రీతీ జింటా ఫైర్!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 21, 2020, 12:25 [IST]
Other articles published on Sep 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X