T20 World Cup 2022: నమీబియాపై నెదర్లాండ్ గెలుపు.. సూపర్ 12కు వెళ్లేది ఎవరంటే..?

టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్ మరో విజయం నమోదు చేసింది. నమీబియాతో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ 48 బంతుల్లో 43 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మైఖేల్ వాన్ లింగేన్ 20 పరుగులు చేశాడు.

19.3 ఓవర్లలో
నెదర్లాండ్ బౌలర్లలో బాస్ డి లీడే 2 వికెట్లు తీయగా.. టిమ్ ప్రింగిల్, అకెర్మాన్, వాన్ మీకెరెన్, వాన్ డెర్ మెర్వే ఒక్కో వికెట్ పడగొట్టారు. 122 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి నెదర్లాండ్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మొదటగా ధాటిగా ఆడిన నెదర్లాండ్ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. తర్వాత తేరుకుని విజయం సాధించింది.

మ్యాక్స్ డౌడ్
మ్యాక్స్ డౌడ్ 35 బంతుల్లో 35 పరుగులు చేయగా.. విక్రమ్‌జిత్ సింగ్ 31 బంతుల్లో 39 పరుగులు చేశాడు.
బాస్ డి లీడే 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్ బౌలర్లలో జేజే స్మీత్ 2 వికెట్లు తీయగా.. బెర్నార్డ్ స్కోల్ట్జ్, జాన్ ఫ్రైలింక్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో నెదర్లాండ్ గ్రూప్ ఎలో నాలుగు పాయింట్లతో టాప్ లో ఉంది. నమీబియా రెండు స్థానంలో ఉండగా.. యూఏఈ, శ్రీలంక తర్వాతి స్థానాల్లో ఉంది.

శ్రీలంక సూపర్ 12కు వెళ్తుందా..?
శ్రీలంక యూఏఈపై గెలిచి, నెదర్లాండ్ పై మెరుగైన రన్ రేట్ తో గెలిస్తే క్వాలిఫైయి అయ్యే అవకాశం ఉంది. నమీబియా యూఏఈని ఓడిస్తే.. అప్పుడు నెదర్లాండ్, శ్రీలంక, నమీబియా నాలుగేసి పాయింట్లతో ఉంటాయి. ఇందులో రన్ రేట్ ఎక్కువ ఉన్న రెండు జట్లు సూపర్ 12కు వెళ్తాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications