For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌లో మరో కొత్త జట్టు.. విశ్వకప్‌నకు నెదర్లాండ్స్ అర్హత!!

ICC T20 World Cup 2020 : Netherlands Secure T20 World Cup Spots || Oneindia Telugu
Netherlands Thrash UAE to Secure 2020 T20 World Cup Berth

దుబాయ్: వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి మరో కొత్త జట్టు అర్హత సాధించింది. తాజాగా విశ్వకప్‌నకు నెదర్లాండ్స్ జట్టు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ప్లేఆఫ్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ని 8 వికెట్ల తేడాతో ఓడించిన నెదర్లాండ్స్ జట్టు పొట్టి ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 80 పరుగులే చేసింది. నెదర్లాండ్ బౌలర్లు బ్రెండన్ గ్లోవర్ (4/12), మీకెరెన్ (2/17), గుగ్‌టెన్ (2/13) విజృంభించడంతో.. యూఏఈ తొమ్మిది పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అయితే అహ్మద్‌ (22), వాహబ్‌ (19) వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో యూఏఈ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ అహ్మద్ రజా (22) టాప్ స్కోరర్. ఆతిథ్య జట్టులో తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు డకౌట్ అయ్యారు.

స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్ 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డచ్ బ్యాట్స్‌మన్‌ బెన్‌ కూపర్‌ (41*) పరుగులతో రాణించాడు. నాలుగు వికెట్లతో సత్తాచాటిన బ్రెండన్ గ్లోవర్‌ 'ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు. ఈ విజయంతో పపువా న్యూగినియా, ఐర్లాండ్ తర్వాత టీ20 ప్రపంచకప్‌నకు క్వాలిఫయింగ్ పోటీల ద్వారా అర్హత సాధించిన మూడో జట్టుగా నెదర్లాండ్ నిలిచింది.

ఆదివారం కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో విజయం సాధించిన పపువా న్యూగినియా టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్‌కు ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్‌‌లో ఓనమాలు నేర్చుకుంటున్న పపువా న్యూగినియా అర్హత సాధించడం ఇదే తొలిసారి. దీంతో ఆ దేశ ప్రజలు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

కోచ్ జో డావ్స్ వల్లే న్యూగినియా విజయాలు సాడితోంది. జో డావ్స్ భారత అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ మాజీ క్రికెటర్ 2012-2014 మధ్య కాలంలో భారత బౌలింగ్ కోచ్‌గా పని చేశారు. అప్పుడు టీమిండియా హెడ్ కోచ్‌గా డంకన్ ప్లెచర్ ఉన్నారు. 2014లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా 1-3తో సిరిస్‌ను చేజార్చుకోవడంతో బౌలింగ్ కోచ్‌తో పాటు ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్సీలను బీసీసీఐ తొలగించింది. ఆ తర్వాత జో డావ్స్ న్యూగినియా జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అతడి నేతృత్వంలో న్యూగినియా రాటు దేలింది. ఇప్పుడు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

Story first published: Wednesday, December 18, 2019, 18:21 [IST]
Other articles published on Dec 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+