పాకిస్తాన్ బౌలర్ రాకాసి బౌన్సర్ - పగిలిన బ్యాటర్ ముఖం..!!

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా పాకిస్తాన్- నెదర్లాండ్స్ మధ్య ఏకపక్షంగా సాగుతోంది. పెర్త్‌లో జరుగుతోన్న ఈ మ్యాచ్‌పై పాకిస్తాన్ పూర్తిగా పట్టు బిగించింది. కంప్లీట్‌గా డామినేట్ చేసింది. నెదర్లాండ్స్ బ్యాటర్లను పాకిస్తాన్ బౌలర్లు వణికించారు. నిప్పులు చెరిగే బంతులను సంధించారు. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ బ్యాటింగ్ కుప్పకూలింది. మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయిందా టీమ్.
91 పరుగులకే..
తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనికోసం తొమ్మిది వికెట్లను కోల్పోవాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ బౌలర్ల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టు మొత్తానికీ ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. మిడిలార్డర్ బ్యాటర్ కొలిన్ అక్కెర్‌మన్- 27, కేప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్- 15 పరుగులు చేశారు. వీరిద్దరే టాప్ స్కోరర్లు.
సింగిల్ డిజిట్సే..
మిగిలిన బ్యాటర్లందరూ పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లు తమ సత్తా చాటారు. సమష్ఠిగా రాణించారు. నిప్పులు చెరిగే బంతులను సంధించారు. నెదర్లాండ్స్ బ్యాటర్లను వణికించారు. షాదబ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్ పంపించాడు. మహ్మద్ వసీం అదే స్థాయిలో ప్రతాపం చూపాడు. మూడు ఓవర్లల్లో 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
నిప్పులు చెరిగిన బంతులతో..
షహీన్ షా అఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 19వ ఓవర్‌లో మహ్మద్ వసీం బ్యాక్ అండ్ బ్యాక్ వికెట్లు పడగొట్టారు. వసీం సంధించిన బంతులకు టిమ్ ప్రింగిల్, ఫ్రెడ్ క్లాసెన్ వికెట్ల వెంటవెంటనే నేలకూలాయి. భారీ షాట్ కొట్టిన ప్రతీసారీ వికెట్లు పడ్డాయి. నెదర్లాండ్స్ ఇన్నింగ్ మొత్తం మీద అయిదే అయిదు ఫోర్లు నమోదయ్యాంటే పాక్ బౌలింగ్ ఎంత కట్టుదిట్టంగా ఉందో అర్థమౌతుంది.
గాయపడ్డ లిడె..
అంతకుముందు- హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఓపెనర్ బాస్ డీ లిడె గాయపడ్డాడు. రవూఫ్ సంధించిన రాకాసి బౌన్సర్‌ను షాట్ ఆడబోయిన లిడె టైమింగ్ మిస్ అయ్యాడు. అది నేరుగా అతని ముఖాన్ని తాకింది. హెల్మెట్ గ్రిల్స్ కూడా అడ్డుకోలేకపోయాయి. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ బంతి ధాటికి లిడె కంటి కింద గాయమైంది. హెల్మెట్ సైతం క్రాక్ అయినట్లు గుర్తించారు. కొద్దిసేపు క్రీజ్‌లోనే కూర్చుండి పోయాడు లిడె. ఫిజియో సూచనల మేరకు మైదానాన్ని వీడాడు. మళ్లీ ఫీల్డ్‌లోకి దిగలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications