Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Frederique Overdijk: టీ20ల్లో సరికొత్త రికార్డు.. 3 పరుగులిచ్చి 7 వికెట్లు! చరిత్రలో తొలి బౌలర్‌గా ఫ్రెడరిక్!

Netherland Women cricketer Frederique Overdijk registers best bowling figures in T20 cricket

ముర్షియా: టీ20 క్రికెట్ అంటేనే బ్యాటర్లది హవా. ఎంతటి టాప్ బౌలర్ అయినా సరే పరుగులు సమర్పించుకోవాల్సిందే. తన కోటా నాలుగు ఓవర్లలోని బంతులను అద్భుతంగా వేస్తె తప్ప.. పరుగులు నియత్రించలేరు. అలాంటిది ఓ మాహిళా బౌలర్ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రెడరిక్‌ ఒవర్డిక్‌... గురువారం ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టింది. తద్వారా అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఫ్రెడరిక్ గుర్తింపు పొందింది. దీంతో ఆమె పేరు ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.

3 పరుగులు.. 7 వికెట్లు:

మహిళల టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఫ్రెడరిక్ ఒవర్డిక్‌ కేవలం 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టింది. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. ఈ మహిళా ప్లేయర్ తన నాలుగు ఓవర్ల కోటాలో రెండు మెయిడిన్లు కూడా వేయడం విశేషం. క్రికెట్‌లో ఇంతకు ముందు ఏ ప్లేయర్ కొద ఇలాంటి ఫీట్ సాధించలేదు. పురుషుల క్రికెట్ అయినా, మహిళల క్రికెట్ అయినా.. టీ20 క్రికెట్‌లో కేవలం ఆరు వికెట్లకు మించి ఎవరూ పడగొట్టలేకపోయారు.

7 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా:

ఇంటర్నేషనల్ టీ20ల్లో ఇప్పటి వరకూ నేపాల్‌కి చెందిన అంజలి ఛాంద్ పేరిట అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. 2019లో మాల్దీవులతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అంజలి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే 6 వికెట్లు పడగొట్టింది. తాజాగా ఆ రికార్డ్‌ని ఫ్రెడరిక్ ఒవర్డిక్‌ కనుమరుగు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో 7 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఫ్రెడరిక్ గుర్తింపు పొందింది. పురుషుల క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు భారత పేసర్ దీపక్ చహర్ పేరిట ఉంది. 2019లో నాగ్‌పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో దీపక్ అద్భుతమైన స్పెల్ వేశాడు. 3.2 ఓవర్లలో కేవలం 7 పరుగులకే 6 వికెట్లను పడగొట్టాడు.

వికెట్-టేకర్‌గా ఫ్రెడెరిక్:

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఫ్రాన్స్ మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఫ్రెడెరిక్ ఒవర్డిక్‌ బౌలింగ్ ముందు ఫ్రాన్స్ జట్టు మొత్తం 33 పరుగులకు చేతులెత్తేసింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫ్రాన్స్ జట్టు.. నాలుగు ఓవర్లలో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత వికెట్ల పతనం ప్రారంభమైంది. ఒక్కొకరుగా వరుసగా పెవిలియన్ చేరారు. మొదటి రెండు వికెట్ల తర్వాత ఫ్రెడరిక్ మాత్రమే వికెట్-టేకర్‌గా మారిపోయింది. వికెట్ల సునామీతో చెలరేగి.. ఏ బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో కుదురుకోనివ్వకుండా చేసింది. ఫ్రాన్స్ నుంచి ఏ బ్యాటర్ కూడా రెండంకెల సంఖ్యను దాటకపోవడం గమనార్హం. ఎంసీ గోనీ మాత్రమే అత్యధికంగా ఎనిమిది పరుగులు చేసింది.

3.3 ఓవర్లలో విజయం:

ఫ్యాన్స్ జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఫ్రెడరిక్ ఒవర్డిక్‌ నాలుగు ఓవర్లలో మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. కానీ వీటిలో ఏవీ బ్యాట్ నుంచి మాత్రం రాకపోవడం విశేషం. ఇన్ని పరుగులు కేవలం వైడ్‌ల ద్వారా వచ్చాయి. మొత్తంగా 14 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే వచ్చాయి. ఇవి కూడా రాకుంటే ఫ్రాన్స్ పరిస్థితి మరి దారుణంగా ఉండేది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ మూడో బంతికి కెప్టెన్ హీథర్ సీజర్స్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. రాబిన్ రికే (21), బాబెట్ లీ లీడ్ (10) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. నెదర్లాండ్స్ 3.3 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన మ్యాచ్గా ఇది మిగిలిపోయింది.

Story first published: Friday, August 27, 2021, 23:06 [IST]
Other articles published on Aug 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+