
చెన్నైసూపర్ కింగ్స్ నెట్ బౌలర్ బర్త్ డే వేడుకలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2022 ప్రారంభం కానున్న నేపథ్యంలో సూరత్‌లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలో చెన్నైసూపర్ కింగ్స్ ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం పుట్టిన జరుపుకుంటున్న ఆ జట్టు నెట్ బౌలర్ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. హోటళ్లో జరిపిన ఈ బర్త్ డే వేడుకల్లో టీం సభ్యలందరితోపాటు టీమ్ మేనేజ్‌మెంట్ కూడా పాల్గొంది. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ముందుండి ఈ బర్త్‌డే వేడుకలను జరపడం విశేషం. కేక్ కట్ చేసిన అనంతరం సదరు నెట్ బౌలర్‌కు ధోని కేక్ తినిపించాడు. ఈ వేడుకల్లో తెలుగు తేజం అంబటి రాయుడు కూడా పాల్గొన్నాడు.
నెట్‌బౌలర్ మోహానికి కేక్ పూసి ఆటగాళ్లంతా సంబరాలు చేసుకోవడం గమనించవచ్చు. దీనికి సంబంధించిన 2 నిముషాల వీడియోను చెన్నైసూపర్ కింగ్స్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఓ సాధారణ నెట్ బౌలర్ బర్త్ డే వేడుకలను ఇలా ఘనంగా నిర్వహించడంపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నెల 26న జరగనున్న తొలి మ్యాచ్‌లో గత ఏడాది సీజన్లో ఫైనల్ చేరిన చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఇందు కోసం ఇప్పటికే సూరత్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ప్రాక్టీసులో ఆ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఆడిన షాట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రాక్టీసులో భారీ షాట్లు ఆడిన ధోని ఏకంగా సింగిల్ హ్యాండ్‌తో సిక్సులు కూడా బాదాడు.
చెన్నైసూపర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్ 2022
మహేంద్ర సింగ్ ధోనీ (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్ అలీ 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్( 6 కోట్లు), దీపక్ చాహర్( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (ఓవర్సీస్-4.40 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్ జొర్డాన్( 3.60 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్ 1.90కోట్లు), ఆడమ్ మిల్నే (ఓవర్సీస్- 1.90 కోట్లు), విక్రమ్ సోలంకి(1.20 కోట్లు), రాజ్‌వర్థన్(1.50 కోట్లు), డేవన్ కాన్వే (ఓవర్సీస్- రూ. కోటి), మహీష్ తీక్షణ (ఓవర్సీస్ 70 లక్షలు), ప్రిటోరియస్ (ఓవర్సీస్ 50 లక్షలు), కేఎమ్ అసిఫ్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, శుభ్రాన్ష్ సేనాపతి, ముకేశ్ చౌధరి, జగదీశన్, హరి నిషాంత్( వీరందరికీ 20 లక్షలు)