Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

29 ఏళ్ల సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన నేపాల్ క్రికెటర్

Nepal’s Rohit Paudel breaks Sachin Tendulkar’s record with international fifty

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 29 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డుని నేపాల్‌కు చెందిన రోహిత్‌ పౌడెల్‌ బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్‌లో అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా సరికొత్త రికార్డుని సృష్టించాడు.

యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్‌ పౌడెల్‌ 58 బంతుల్లో 55 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో అతిపిన్న వయసు(16 ఏళ్ల 146 రోజులు)లో అంతర్జాతీయ క్రికెట్‌లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డును రోహిత్ నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో అతడు సచిన్‌ టెండూల్కర్‌ (16 ఏళ్ల 213 రోజులు) పేరిట ఉన్న 29 ఏళ్ల రికార్డును అధిగమించాడు.

సచిన్‌ టెండూల్కర్ 1989లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో 59 పరుగులు చేశాడు. దీంతో పాటు పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ షాహిద్‌ అఫ్రీది (16 ఏళ్ల 217 రోజులు) రికార్డు కూడా కనుమరుగైపోయింది. ఆఫ్రిది 16 ఏళ్ల 217 రోజుల వయసులో శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీ చేశాడు.

రోహిత్ హాఫ్ సెంచరీతో 242/9 స్కోరు చేసిన నేపాల్.. యూఏఈని 97 పరుగులకే ఆలౌట్ చేయడంతో 145 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే అత్యంత పిన్న వయస్సు (15 ఏళ్ల 335 రోజులు)లోనే వన్డేల్లో అరంగేట్రం చేసిన వారిలో రోహిత్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు.

Story first published: Sunday, January 27, 2019, 11:34 [IST]
Other articles published on Jan 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+