Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెదర్లాండ్స్‌తో రెండు మ్యాచ్‌ల సిరిస్: వన్డే అరంగేట్రం చేయనున్న నేపాల్

Nepal to Make ODI Debut in Two-match Series Against Netherlands

హైదరాబాద్: నేపాల్‌ జాతీయ క్రికెట్‌ జట్టు వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు ముహుర్తం ఖరారైంది. ఆగస్టులో నెదర్లాండ్స్‌తో నేపాల్ జట్టు రెండు వన్డేల సిరిస్ ఆడనుంది. నేపాల్‌తో రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సంబంధించి నెదర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు(కేఎన్‌సీబీ) మంగళవారం అధికారిక ప్రకటన చేసింది.

తొలి వన్డే హాగ్‌లోని‌ వూర్‌బుర్గ్ సీసీ స్టేడియంలో జరగనుండగా... రెండో వన్డే అమస్టర్‌డామ్‌లోని వీఆర్ఏ గ్రౌండ్‌లో జరగనుంది. ఇటీవల నేపాల్‌తో పాటు నెదర్లాండ్‌, యూఏఈ, స్కాట్లాండ్‌ జట్లకు వన్డే హోదా దక్కిన సంగతి తెలిసిందే. జూన్‌ 1 నుంచి ఆయా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల ఆధారంగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను కూడా కేటాయించునుంది.

గతేడాది ఐసీసీ నిర్వహించిన వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లో నెదర్లాండ్స్ విజేతగా నిలవడంతో ఐసీసీ నెదర్లాండ్స్‌కు వన్డే హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో మెరుగైన స్థానాల్లో నిలవడం ద్వారా స్కాట్లాండ్, యూఏఈ, నేపాల్ జట్లకు వన్డే హోదా లభించింది.

ప్రస్తుతం నేపాల్ జట్టు ఖాతాలో ఒక్క రేటింగ్ పాయింట్ కూడా లేకపోగా, నెదర్లాండ్స్‌కు 13 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ర్యాంకుల కోసం ఈ రెండు జట్లు చెరో నాలుగేసి మ్యాచ్‌లు ఆడిన తర్వాత మాత్రమే వాటికి ఐసీసీ ర్యాంకులను కేటాయించనుంది. కాగా, వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆథిత్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, July 10, 2018, 14:07 [IST]
Other articles published on Jul 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+