Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెరీర్ ఆరంభంలోనే నేపాల్‌ యువ స్పిన్నర్‌కు అరుదైన అవకాశం

Nepal leg-spinner Sandeep Lamichhane added to ICC World XI squad

హైదరాబాద్: నేపాల్‌కు చెందిన యువ స్పిన్నర్ సందీప్‌ లమిచానే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఐసీసీ వరల్డ్ ఎలెవన్‌ జట్టులో అతనికి చోటు దక్కింది. ఈ వరల్డ్ ఎలెవన్ జట్టు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా వెస్టిండిస్ జట్టుతో
తలపడనుంది. 'హరికేన్ రిలీఫ్ టీ20 ఛాలెంజ్' పేరిట నిర్వహించనున్న ఈ మ్యాచ్‌లో ఐసీసీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవెన్‌తో వెస్టిండీస్ జట్టు తలపడబోతోంది.

వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. మే 31న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్‌లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఆంగ్విలాలోని రొనాల్డ్ వెబ్‌స్టర్ పార్క్, ఆంటిగ్వాలోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం, డొమినికాలోని విన్డ్‌సర్ పార్క్ స్టేడియం, బీవీఐలోని షిర్లే రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ మార్టిన్‌లోని కారిబ్ లంబర్ బాల్ పార్క్ మైదానాలు తుపాను దాటికి దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరణ పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఐసీసీ వెస్టిండీస్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవెన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైంది.

పాకిస్తాన్‌ నుంచి షోయబ్‌ మాలిక్‌, షాహిద్‌ అఫ్రిదీ, తిసారా పెరీరా(శ్రీలంక), షకీబ్‌ అల్‌ హసన్‌, తమీమ్‌ ఇక్బాల్‌(బంగ్లాదేశ్‌), రషీద్‌ ఖాన్‌ (అప్ఘనిస్తాన్‌)లను ఎంపిక చేయగా భారత్‌ నుంచి పాండ్యా, కార్తీక్‌లకు అవకాశం కల్పించింది. ఇక, న్యూజిలాండ్ నుంచి లూక్‌ రోంచి, మిచెల్‌ మెక్లన్‌గన్‌‌లకు చోటు దక్కగా, ఇప్పుడు వీరితో కలిసి ఆడే అరుదైన అదృష్టం ఇప్పుడు 17 ఏళ్ల లమిచానేకు దక్కింది.

ప్రపంచ క్రికెట్‌ లీగ్‌ డివిజన్‌-2లో లమిచానే ఆరు మ్యాచ్‌లాడి 17 వికెట్లతో రాణించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 11వ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు, వరల్డ్ ఎలెవన్‌ ఢీకొనబోతున్న 13 మంది సభ్యులతో కూడిన వెస్టిండిస్ జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కార్లోస్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. క్రిస్ గేల్, మార్లోన్ శామ్యూల్స్, ఆండ్రూ రసెల్ వంటి హేమాహేమీలు జట్టులో ఉన్నారు.

వరల్డ్‌ ఎలెవన్‌ తుది జట్టు:
ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), షాహిద్‌ అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌, దినేశ్‌ కార్తీక్‌(వికెట్‌ కీపర్‌), షకీబుల్‌ హసన్‌, తమీమ్‌ ఇక్బాల్‌, తిసార పెరీరా, రషీద్‌ ఖాన్‌, హర్దీక్‌ పాండ్యా, లూక్‌ రోంచి, మెక్లినగన్‌, సందీప్ లమిచానే

వెస్టిండిస్‌:
కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, రయాద్‌ ఎమ్రిత్‌, ఆండ్రూ ఫ్లెచర్‌, క్రిస్‌గేల్‌, ఎవిన్‌ లూయిస్‌, అశ్లే నర్స్‌, కీమోపాల్‌, రోవ్‌మాన్‌ పొవెల్‌, దినేష్‌ రామ్‌డిన్‌ (వికెట్‌ కీపర్‌), ఆండ్రూ రస్సెల్‌, సామ్యుల్‌ బద్రీ, మార్లాన్‌ సామ్యుల్స్‌, కెస్రిక్‌ విలియమ్స్‌

Story first published: Thursday, May 17, 2018, 8:14 [IST]
Other articles published on May 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+