న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 చరిత్రలో సరికొత్త రికార్డు: 6 వికెట్లు.. 0 పరుగులు!!

6 wickets, 0 runs: Nepal bowler Anjali Chand produces best-ever bowling figures in T20I history on debut in SAG 2019

నేపాల్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు బద్దలవడం సహజమే. అయితే కొన్ని సార్లు కలలో కూడా ఊహించని రికార్డులు లిఖించబడుతున్నాయి. తాజాగా ఇలాంటి రికార్డే నమోదయింది. అంతర్జాతీయ టీ20ల్లో నేపాల్‌ మహిళా క్రికెటర్‌ అంజలీ చాంద్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆరు వికెట్లు తీయడమే కాకుండా.. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ నెలకొల్పిన రికార్డు బద్దలయింది.

చికెన్‌ బర్గర్‌ చూసి ఆగలేకపోయా.. ఫుల్‌గా లాగించేశా: కోహ్లీచికెన్‌ బర్గర్‌ చూసి ఆగలేకపోయా.. ఫుల్‌గా లాగించేశా: కోహ్లీ

 6 వికెట్లు.. 0 పరుగులు:

6 వికెట్లు.. 0 పరుగులు:

సోమవారం మాల్దీవులు, నేపాల్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మాల్దీవులు.. నేపాల్‌ మీడియం పేస్‌ బౌలర్‌ అంజలీ చాంద్‌ దెబ్బకు 16 పరుగులకే ఆలౌట్ అయింది. ఏడో ఓవర్‌లో బంతిని అందుకున్న అంజలీ చాంద్‌ మూడు వికెట్లు తీసింది. 9 ఓవర్‌లో రెండు వికెట్లు, 11 ఓవర్‌లో మరో వికెట్‌ను ఖాతాలో వేసుకుంది.

ఐదు బంతుల్లో విజయం:

ఐదు బంతుల్లో విజయం:

అంజలితో పాటు కరుణ భండారి (2/4) రెండు వికెట్లు తీసింది. మాల్దీవులు ఇద్దరు బ్యాట్స్‌ఉమన్‌ రనౌట్ అయ్యారు. 8 మంది ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇద్దరు మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్లు చేశారు. ఇక 17 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌ 0.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్ కాజల్ శ్రేష్ట 13 పరుగులు చేయగా.. నాలుగు అదనపు (2 వైడ్, 1 లెగ్ బై, 1 నోబాల్) పరుగులు వచ్చాయి.

చాహర్‌ రికార్డు బద్దలు:

ఈ అద్భుత స్పెల్‌లో అంజలీ చాంద్‌ ఆరు వికెట్లు సాధించడమే కాకుండా ఒక్క పరుగులివ్వని బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. కేవలం 2.1 ఓవర్లు మాత్రమే వేసి ఆరు వికెట్లు సాధించడం విశేషం. అయితే ఇక్కడ పరుగులు ఇవ్వకపోవడం రికార్డుగా చేరింది. అంజలీ అద్భుత గణాంకాలు (2.1-2-0-6) నమోదు చేయడంతో టీ20లో భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ (7/6) నెలకొల్పిన రికార్డు బద్దలయింది.

దక్షిణాసియా క్రికెట్‌ గేమ్స్‌:

దక్షిణాసియా క్రికెట్‌ గేమ్స్‌లో భాగంగా నాలుగు జట్లు ఆడుతున్నాయి. నేపాల్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగే ఈ మ్యాచ్‌లలో టాప్‌లో నిలిచిన రెండు జట్లు స్వర్ణ పతకం కోసం పోటీ పడతాయి. ఇక ఆఖరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు కాంస్య పతకం కోసం తలపడనున్నాయి.

Story first published: Monday, December 2, 2019, 18:44 [IST]
Other articles published on Dec 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X