న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ విషయంలో తలదూర్చను: ఊహించని ప్రశ్నకు రోహిత్ తెలివిగా సమాధానం

‘Neither I am President nor the regular captain to comment’ – Rohit Sharma on Farokh Engineer’s controversial comment


హైదరాబాద్: అనుష్క శర్మ-ఫరూక్ ఇంజనీర్ వివాదంపై మాట్లాడేందుకు తానేమీ రెగ్యులర్ కెప్టెన్‌ హోదాలో లేనని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే.

పనిభారం కారణంగా ఈ సిరిస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో బంగ్లాతో టీ20 సిరిస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు. తొలి టీ20 ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మకు ఊహించిన ప్రశ్న ఎదురు కావడంతో కాస్త అసహనంతో మాట్లాడాడు.

నెట్స్‌లో రోహిత్, ధావన్ వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు: ఎవరీ కేశవ్ దబాస్?నెట్స్‌లో రోహిత్, ధావన్ వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు: ఎవరీ కేశవ్ దబాస్?

నేను అధ్యక్షుడిని కాదు

నేను అధ్యక్షుడిని కాదు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మపై మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ చేసిన వ్యాఖ్యలపై రోహిత్ శర్మను స్పందించాల్సిందిగా ఓ విలేకరి ప్రశ్నించగా "నేను అధ్యక్షుడిని కాదు, రెగ్యులర్ కెప్టెన్ కాదు. కాబట్టి దీని గురించి నేను ఏమి చెప్పాలి? కాబట్టి అతన్నే అడగండి (ఫరోఖ్ ఇంజనీర్) అతను ఏమి చెప్పడో మీకు తెలుస్తుంది? నేను మాట్లాడటానికి ఏముంది. ఫరూక్‌ సర్‌ ఏమి చెప్పాడనే విషయంలో తలదూర్చను" అని అన్నాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

గురువారం పుణెలోని వెంగసర్కార్‌ క్రికెట్‌ అకాడమీని సందర్శించడానికి వెళ్లిన ఫరూక్‌ ఇంజనీర్ మాట్లాడుతూ ‘‘మనకు మిక్కీ మౌస్‌ సెలక్షన్‌ కమిటీ ఉంది. సెలక్షన్‌ ప్రక్రియపై కోహ్లీ ప్రభావం ఉండడం మంచిదే. కానీ సెలక్టర్లకు ఆ పదవికి తగిన అర్హత ఉందా? అందరూ కలిసి 10-12 టెస్టులే ఆడారు'' అని ఫరూక్‌ అన్నాడు. ‘‘నాకు ఆ సెలక్టర్‌ పేరు కూడా తెలియదు. ప్రపంచకప్‌ సందర్భంగా అతడు ఇండియా బ్లేజర్‌ వేసుకుంటే ‘ఎవరు నువ్వు' అని అడిగా. తాను సెలక్టర్‌నని అతడు చెప్పాడు. అనుష్క శర్మకు టీలు తెచ్చివ్వడమే అక్కడ సెలక్టర్లు చేస్తున్న పని'' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అనుష్క శర్మ సైతం ట్విట్టర్‌లో

ఈ వ్యాఖ్యలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా ట్విట్టర్‌లో ఆగ్రహం వ్కక్తం చేసింది. "విమర్శలు చేసేవారు చాలాసార్లు నా గురించి తప్పుగానే చెబుతున్నారు. ఇదే మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూ ఉంది. అన్ని నిజాలు అయినట్టు ప్రచారం చేస్తున్నారు. నా గురించి వస్తున్న వార్తలు చూసి భయపడుతున్నా. అర్థం లేని అబద్ధాలతో కూడిన విమర్శలకు, కామెంట్లకు స్పందించడం ఇష్టం లేకే ఇంతకాలం మౌనంగా ఉన్నా. ప్రతీ విషయానికి మాట్లాడకుండా ఉంటే.. పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీనికి ఈ రోజైనా ముగింపు దొరకాలని స్పందిస్తున్నా. కోహ్లీ ప్రదర్శన బాగా లేనప్పుడు నన్ను టార్గెట్‌ చేశారు. దీనిపై కోహ్లీ వివరణ ఇస్తూనే ఉన్నాడు. నేను అప్పుడు కూడా సైలెంట్‌గానే ఉన్నా. అనవసరమైన వివాదాల్లోకి తరచు నన్ను లాగుతున్నారు. మీ అందరికీ నేనే దొరికానా. జరిగిన వాస్తవాలను మరుగన పడేస్తున్నారు. కోహ్లీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నా సొంత ఖర్చులతోనే వెళుతున్నా. ఎవరైనా అడిగిన క్రమంలో గ్రూప్‌ ఫోటోకి ఫోజిచ్చినా నన్నే విమర్శిస్తున్నారు. ఈ వార్తలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్రపంచకప్‌ మ్యాచ్‌లో సెలక్టర్లు నాకు టీ అందించారనడం చెడు ఉద్దేశంతో చెప్పిన అబద్ధం. టోర్నీలో నేను ఒక్క మ్యాచే చూశాను. అదీ ఫ్యామిలీ బాక్స్‌లో ఉండి చూశా. సెలెక్టర్ల బాక్స్‌లో నేను కూర్చోలేదు. మీరు సెలెక్షన్‌ కమిటీపైనా, వారి అర్హతలపైనా ఏవైనా విమర్శలు చేయాలనుకుంటే చేసుకోండి. అది మీ ఇష్టం. కానీ.. వివాదాల్లోకి నా పేరును లాగొద్దు. దురుద్దేశంతో కూడిన వ్యవహారాల్లో నా పేరును వాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. వాస్తవాలను మాట్లాడండి. ఆధారాలతో మాట్లాడండి. నన్ను ఇక్కడితో వదిలేయండి" అని అనుష్క శర్మ అన్నారు.

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ

"ఫరూక్ మాటలతో నేను బాధపడుతున్నాను. ఆయన తన పనికిరాని ఆరోపణల ద్వారా భారత కెప్టెన్ యొక్క సెలెక్టర్లు మరియు భార్యను అగౌరవపరిచారు. భారత కెప్టెన్‌, అతడి భార్య కూర్చున్న బాక్స్‌లో ఏ భారత సెలక్టర్‌ కూడా కూర్చోలేదు. ఏదో పిచ్చి ప్రేలాపన చేసి పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. తప్పుడు ఆరోపణలతో భారత సెలక్టర్లతో పాటు కెప్టెన్‌ భార్య పరువు కూడా తీస్తున్నారు. సెలక్షన్ కమిటీని సరైన ప్రక్రియ ద్వారా బీసీసీఐ తమను సెలక్టర్లుగా నియమించిన విషయం మరువొద్దు. 82 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి దానికి తగినట్లుగా వ్యవహరించాలి" అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Story first published: Saturday, November 2, 2019, 18:48 [IST]
Other articles published on Nov 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X