For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్ పేసర్ హెచ్చరిక.. మరోసారి భారత బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవు!!

Neil Wagner issues a warning to Virat Kohli ahead of second Test

హెగ్లే ఓవల్‌: ఫిబ్రవరి 29 నుంచి క్రైస్ట్‌చర్చి వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ముందే న్యూజిలాండ్‌ పేసర్ నీల్‌ వాగ్నర్‌ కోహ్లీసేనకు హెచ్చరికలు పంపాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు మరోసారి ఇబ్బందులు తప్పవన్నాడు. ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలించే హెగ్లే ఓవల్‌ మైదానంలో వేగం, బౌన్స్‌లతో కూడిన మా బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమేనన్నాడు. వాగ్నర్‌ భార్య ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో అతడు తొలి టెస్టు నుంచి తప్పుకున్నాడు.

భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలే

భారత బ్యాట్స్‌మెన్‌కు సవాలే

తాజాగా నీల్‌ వాగ్నర్‌ మాట్లాడుతూ... 'క్రైస్ట్‌చర్చ్‌లో ఆడటం కోహ్లీసేనకు కచ్చితంగా ఇబ్బందే. ఎందుకంటే.. వారు ఇంకా ఎక్కువగా పేస్‌, బౌన్స్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత ఆటగాళ్లు కొత్త వాతావరణానికి అలవాటు పడటం కష్టం. కట్టుదిట్టమైన బంతులు, లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో ఒత్తిడి చేస్తే.. మా పని సులువు అవుతుంది. టెస్టు సిరీసులో కేవలం రెండు మాత్రమే ఉండడంతో కివీస్‌ పరిస్థితులు, వాతావరణానికి అలవాటు పడేందుకు కోహ్లీసేనకు సమయం లేదు' అని అన్నాడు.

నా కూతురు ఇంకాస్త ముందే జన్మించివుంటే

నా కూతురు ఇంకాస్త ముందే జన్మించివుంటే

'ఒక్కోసారి విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఒకటి లేదా రెండు మ్యాచుల సమయం పడుతుంది. అయితే భారత్‌ బలంగా పుంజుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మాకు అనువైన పరిస్థితుల్లో మేం కూడా కచ్చితంగా ప్రభావం చూపిస్తాం. యువ పేసర్ పేసర్‌ జేమీసన్‌ బాగా ఆడాడు. నా కూతురు ఇంకాస్త ముందే జన్మించివుంటే నేను జట్టుతోనే ఉండేవాడిని. ఐతే ప్రపంచంలో దేన్నీ మనం మార్చలేం కదా' అని వాగ్నర్‌ తెలిపాడు.

కోహ్లీ వికెట్ తీయాలనుకుంటున్నా

కోహ్లీ వికెట్ తీయాలనుకుంటున్నా

'నేను ఏ జట్టుతో ఆడినా ఆ జ్జట్టులోని ఉత్తమ బ్యాట్స్‌మన్‌ వికెట్ తీయడానికి ప్రయత్నిస్తా. ఉత్తమ ఆటగాళ్ల వికెట్ తీసినప్పుడు అది ఆ జట్టులో పెద్ద ప్రభావం చూపిస్తుంది. టాప్ ఆటగాళ్ల వికెట్ ఎప్పుడూ సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో స్టీవ్ స్మిత్‌ను ఇబ్బంది పెట్టా. ఇప్పుడు విరాట్ కోహ్లీ వికెట్ తీయాలనుకుంటున్నా. ఆరు ఇన్నింగ్స్‌లలో కోహ్లీని మూడుసార్లు ఔట్ చేశా' అని వాగ్నర్‌ చెప్పుకొచ్చాడు.

వాగ్నర్‌ తుది జట్టులో ఉంటాడు

వాగ్నర్‌ తుది జట్టులో ఉంటాడు

న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టీడ్‌ మాట్లాడుతూ... 'టీమిండియాను చూసి నాకు ఆశ్చర్యమేసింది. అంత సులభంగా లొంగిపోతుందనుకోలేదు. మేం సుదీర్ఘంగా చేసిన ఒత్తిడి మూలంగానే ఇది సాధ్యమైంది. న్యూజిలాండ్‌ వాతావరణం, పరిస్థితుల్లో టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌ అద్భుతంగా బంతులు వేస్తారు. ముఖ్యంగా ఎనిమిది వారాల విశ్రాంతి తర్వాత జట్టులోకి వచ్చిన బౌల్ట్‌లో ఓ జ్వాల కనిపించింది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కన్నా న్యూజిలాండ్‌లో ఆడటం కష్టమన్న భావనను మేం కలిగించామనుకుంటున్నాం. అది మాకు గర్వకారణం. నీల్‌ వాగ్నర్‌ రావడం మాకు సంతోషకరం. అయితే కొద్దిగా తలనొప్పి కూడా ఉంది. అరంగేట్రంలోనే కైల్ జేమీసన్‌ అదరగొట్టాడు. కానీ.. వాగ్నర్‌ తుది జట్టులో ఉంటాడు' అని తిప్పాడు.

Story first published: Wednesday, February 26, 2020, 17:17 [IST]
Other articles published on Feb 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+