ముంబై: ఆస్ట్రేలియాతో ట్వంటీ 20 సిరీస్‌కు జట్టును ప్రకటించారు. జట్టులో ఆశిష్ నెహ్రాకు చోటు దక్కింది. అజింక్యా రహానేకు తప్పించారు.
జట్టులో చోటుకోసం అటు గాయాలతో ఇటు కుర్రాళ్లతో పోరాటం సాగిస్తున్న వెటరన్ పేసర్ నెహ్రా ఇప్పుడు మరోసారి విజయం సాధించాడు. ఎనిమిది నెలల తర్వాత అతడు టీమిండియాలో చోటు సంపాదించాడు.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆదివారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడే భారత జట్టును ప్రకటించింది.

దినేశ్ కార్తీక్‌కూ చోటు లభించింది. వన్డే జట్టులోని రహానె, షమి, ఉమేశ్‌లు ఎంపిక కాలేదు. తన భార్య అనారోగ్యం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన శిఖర్ ధావన్ కూడా టీ20 జట్టుకు ఎంపికయ్యాడు.
జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా, భువనేశ్వర్, నెహ్రా, అక్షర్ పటేల్