For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashish Nehra: అందుకే చాహల్ రెండో టీ20లో ఫెయిల్ అయ్యాడు, మూడో టీ20లో సరిచేసుకుని రాణించాడు

Nehra claims that Yuzvendra Chahal Leaving his aggressive, and bowled defensively in the 2nd T20

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు టీ20ల్లో నిరాశాజనకమైన ప్రదర్శనతో యుజ్వేంద్ర చాహల్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరిగిన మూడో టీ20ల్లో తిరిగి తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇండియా సిరీస్‌ను సజీవంగా ఉంచుకుంది. భారత్ మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 48పరుగుల తేడాతో ఓడించడం ద్వారా జట్టు పరంగా పటిష్ఠంగా ఉందనే సంకేతాలిచ్చింది. ఇకపోతే లెగ్-స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్‌ను ముప్పుతిప్పలు పెట్టేలా బౌలింగ్ చేయడంతో పాటు 4ఓవర్లలో 3వికెట్లు తీసి కేవలం 20పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మూడు కీలక వికెట్లు తీసిన చాహల్

మూడు కీలక వికెట్లు తీసిన చాహల్

చాహల్ పించ్-హిట్టర్‌ అయిన డ్వైన్ ప్రిటోరియస్‌ తొలుత ఔట్ చేసిన చాహల్ సౌతాఫ్రికాకు తన తొలి పంచ్ రుచిచూపించాడు. ఇక మొదటి టీ20లో దక్షిణాఫ్రికాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన రాస్సీ వాన్ డెర్ డుస్సెన్‌ను అతను ఔట్ చేసి రెండో పంచ్ ఇచ్చాడు. రెండో టీ20ల్లో దక్షిణాఫ్రికా మ్యాచ్ విన్నర్ అయిన హెన్రిచ్ క్లాసెన్‌ను ఊరించే బంతితో క్యాచ్ ఔట్ చేసి మూడో పంచ్ ఇచ్చాడు. ఇక చాహల్ ప్రదర్శన పట్ల భారత మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. రెండో టీ20లో కొంచెం డిఫెన్సివ్‌గా బౌలింగ్ చేసిన చాహల్ మూడో టీ20లో తనదైన దూకుడును ప్రదర్శించి రాణించాడని పేర్కొన్నాడు.

మనకు తెలిసిన చాహల్ చాలా అగ్రెస్సివ్

మనకు తెలిసిన చాహల్ చాలా అగ్రెస్సివ్

ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ.. 'మనకు తెలిసిన చాహల్ చాలా అగ్రెసివ్ బౌలింగ్ చేయగలిగే ప్లేయర్. అతని దూకుడు బౌలింగ్‌ను ఈ మ్యాచ్‌లో చూడగలిగాం. అతను తన వేగాన్ని మార్చే విధానం, అతను తన లెంత్ ఛేంజ్ చేసే పద్ధతి, తెలివిగా బురిడికొట్టించే నేర్పు అతను మనకు చూపించాడు.' అని మ్యాచ్ తర్వాత క్రిక్‌బజ్‌తో నెహ్రా పేర్కొన్నాడు. 'ఇక చివరి మ్యాచ్ క్లాసెన్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఎక్కడో చాహల్ తాను చాలా డిఫెన్సివ్‌గా బౌలింగ్ చేస్తున్నా అనే ఫీలింగ్ అతనిలో కలిగే ఉంటుంది. ఆ డిఫెన్సివ్ నేచర్ వల్లే చాహల్ క్లాసెన్ బ్యాటింగ్ ధాటిని మరింత పెంచి ఉండొచ్చు.' అని నెహ్రా పేర్కొన్నాడు.

 చాహల్ ఓవర్లు పూర్తయ్యేసరికి మ్యాచ్ మన చేతుల్లోకి

చాహల్ ఓవర్లు పూర్తయ్యేసరికి మ్యాచ్ మన చేతుల్లోకి

ఇక ఇండియా విధించిన 180 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా అవకాశాలను చాహల్ తన బౌలింగ్‌తో అంతమొందించాడని నెహ్రా పేర్కొన్నాడు. 'చాహల్ తన ఓవర్లలో బ్యాటర్లను పూర్తిగా ట్రాప్ చేశాడు. అతను 3, 4, 5వ స్థానాల బ్యాటర్ల వికెట్లు తీశాడు. చాహల్ ఓవర్లు పూర్తయ్యే సమయానికి దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలిచే అవకాశాల నుంచి పూర్తిగా వైదొలిగింది' అని నెహ్రా తెలిపాడు.

 చాహల్‌కు తోడు హర్షల్ చెలరేగడంతో..

చాహల్‌కు తోడు హర్షల్ చెలరేగడంతో..

ఇక టీమిండియా బ్యాటింగ్లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో తొలుత భారత్ 5వికెట్లు కోల్పోయి 179పరుగులు చేయగలిగింది. చాహల్ అద్భుత స్పెల్‌కు తోడు హర్షల్ పటేల్ 4వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా 131పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ సిరీస్‌లో 2-1తో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో ఉంది. ఇక ఇరు జట్లు శుక్రవారం రాజ్‌కోట్‌లో నాలుగో టీ20లో తలపడనున్నాయి.

Story first published: Wednesday, June 15, 2022, 16:44 [IST]
Other articles published on Jun 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+