Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజస్థాన్ ప్లేయర్ గుట్టు విప్పిన బోల్డ్ బ్యూటీ!

ప్రముఖ మోడల్, నటి నేహాల్ వడోలియా ఓ ఐపీఎల్ క్రికెటర్‌పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌‌గా మారాయి. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ఒక క్రికెటర్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం మెసేజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టాడని సంచలన ఆరోపణలు చేసింది. అయితే సదరు ఆటగాడి పేరును ఆమె నేరుగా బయటపెట్టకపోవడంతో ఆ క్రికెటర్ ఎవరై ఉంటారా అనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది.

ఆ ఇంటర్వ్యూలో నేహాల్ వడోలియా మాట్లాడుతూ.. సదరు రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ తన సోషల్ మీడియా పోస్టులను క్రమం తప్పకుండా చూసేవాడని, తన అందాన్ని పొగుడుతూ తరచూ ఫ్లర్టింగ్ మెసేజ్‌లు పంపేవాడని పేర్కొంది. "ఆయన పేరు చెప్పేయమంటారా? అతనేం అంత పెద్ద ఫేమస్ ప్లేయర్ కాదు.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతుంటాడు, పైగా అతనికి విడాకులు కూడా అయ్యాయి" అంటూ నెహాల్ సంచలన హింట్ ఇచ్చింది. ఆ క్రికెటర్ తనను "హాట్", "ప్రెట్టీ", "బ్యూటిఫుల్" అంటూ పదే పదే మెసేజ్‌లు పంపడం తనకు నచ్చలేదని.. అతనితో ఎలాంటి వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడం ఇష్టం లేకనే ఆ చాటింగ్‌ను కట్ చేశానని నెహాల్ వడోలియా స్పష్టం చేసింది.

Nehal Vadoliya Claims Divorced Rajasthan Royals Cricketer Sent Her Flirty Instagram DMs Full Details

ఆ క్రికెటర్ మెసేజ్‌‌లతో తాను తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని, అందుకే ఇక ఏమాత్రం సంభాషణలు సాగించకూడదనే ఉద్దేశంతో అతడిని సోషల్ మీడియాలో పూర్తిగా బ్లాక్ చేసినట్లు నెహాల్ వడోలియా తెలిపింది. తాను గనుక ఒక్క మెసేజ్ రిప్లై ఇచ్చినా అతను మళ్లీ చాటింగ్ మొదలుపెడతాడని, అసలు తనకు అతనితో మాట్లాడటమే ఇష్టం లేదని ఆమె వివరించింది. నెహాల్ వడోలియా డిజిటల్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆమె గందీ బాత్-3, మస్త్రామ్, జూలీ, ఉడ్‌పెక్కర్, దునాలి, ఇమ్లీ వంటి ప్రసిద్ధ వెబ్ సిరీస్‌లతో పాటు బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో 'తారక్ మెహతా కా ఊల్తా చష్మా'లో కూడా నేహా అనే పాత్రలో కాసేపు మెరిసింది.

ఇదే ఇంటర్వ్యూలో నెహాల్ వడోలియా సోషల్ మీడియా వివాదాల్లో సెలబ్రిటీలు చెప్పే 'అకౌంట్ హ్యాక్ అయింది' అనే సాకులపై కూడా చురకలు అంటించింది. చాటింగ్‌లు బయటపడినప్పుడు తప్పుల నుంచి తప్పించుకోవడానికి చాలామంది డ్రామాలు ఆడుతుంటారని, నిజంగానే హ్యాక్ అయి ఉంటే అందుకు తగ్గ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. గుజరాతీ నటుడు కరణ్ జోషి గతంలో తనకు ఇలాగే అసభ్యకర సందేశాలు పంపాడని, ఆ తర్వాత సినిమా ప్రమోషన్ల కోసం తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ కవర్ చేశాడని చెబుతూ నెహాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె ఇచ్చిన హింట్స్‌తో రాజస్థాన్ రాయల్స్ విడాకులైన క్రికెటర్ కోసం నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతుకులాట మొదలుపెట్టారు.

Story first published: Sunday, May 31, 2026, 11:05 [IST]
Other articles published on May 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+