వరల్డ్ టీ20 2016: తెలుగు వ్యక్తికి కీలక బాధ్యతలు..!
న్యూఢిల్లీ: 2016లో జరగనున్న వరల్డ్ టీ20 టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్‌ను భద్రత, అవినీతి నిరోధక విభాగం ముఖ్య సలహాదారుగా బీసీసీఐ నియమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఏడాది పాటు అవినీతి నిరోధక విభాగంలో నీరజ్ కుమార్ పనిచేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ నిర్వహణలో తెలుగు వ్యక్తి ముఖ్య భూమిక పోషించనున్నాడు. టోర్నమెంట్ నిర్వహణ కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీలో క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్‌గా తెలుగు నేలకు చెందిన వ్యక్తి డాక్టర్ ఎంవీ శ్రీధర్‌ను ఎంపిక అయ్యారు.
కాగా, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్‌గా కేవీపీ రావు, టోర్నమెంట్ మీడియా మేనేజర్‌గా నిషాంత్ జీత్ ఆరోరా, లాజిస్టిక్స్ అండ్ హాస్పిటాలిటీ మేనేజర్‌గా మయాంక్ పరీఖ్, కమిటీ సలహాదారుగా ప్రొఫెసర్ రత్నాకర్ శెట్టి తదితరులు ఎంపికయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications